జగన్ కడప షెడ్యూల్ ఖరారు

ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి రెండు రోజుల పాటు వైఎస్సార్‌ కడప జిల్లాలో పర్యటించనున్నారు. దీనికి సంబదించిన షెడ్యూల్ ఖరారు అయ్యింది. బుధువారం మధ్యాహ్నం 3.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ నుంచి కడప వెళ్లనున్నారు. సాయంత్రం 4.50 గంటలకు ఇడుపులపాయ చేరుకుని పార్టీ నాయకులతో మాట్లాడి, ఆ రాత్రి వైఎస్సార్‌ ఎస్టేట్‌లోని గెస్ట్‌హౌస్‌లో రెస్ట్ తీసుకోనున్నారు.

గురువారం దివంగత నేత డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి వర్ధంతి సందర్భంగా ఉదయం 9.30 గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద జరిగే ప్రత్యేక ప్రార్ధనల్లో పాల్గొని నివాళులు అర్పించనున్నారు. ఆ తర్వాత పార్టీ నాయకులతో భేటీ అయ్యి.. ఉదయం 11.30 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్‌ నుంచి తాడేపల్లి నివాసానికి బయలుదేరనున్నారు.