జగన్‌ వ్యాఖ్యలు ఇకనైనా మానుకోవాలి: దేవినేని

AP Minister Devineni Uma
AP Minister Devineni Uma

నంద్యాల: వైకాపా అధినేత జగన్‌పై ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మండిపడ్డారు. కేవలం పదవి
కాంక్షతోనే జగన్‌ రగిలిపోతున్నారని, రాష్ట్ర సర్కార్‌ను నిందిస్తూ చేస్తోన్న వ్యాఖ్యలను ఇకనైనా మానుకోవాలని
హితవు పలికారు. ప్రతిపక్ష నేతగా జగన్‌ ఏపీ అభివృద్ధిలో ఎలాంటి నిర్మాణాత్మక పాత్ర పోషించారని ఆయన
ప్రశ్నించారు. అలాగే జగన్‌కి క్యూసెక్కులు, టీఎంసీలకు తేడా తెలియదని, పట్టిసీమ ప్రాజెక్టు నుంచి వచ్చిన
నీటితో రైతులు ఆనందంగా పంటలు పండించుకుంటున్నారని దేవినేని అన్నారు.