జగన్‌ వేషాలు తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలి

AP CM Chandrababu Naidu
AP CM Chandrababu Naidu

అమరావతి: రాబోయే ఎన్నిలకలో టిడిపి బ్రహ్మాండమైన ఫలితాలు రాబోతున్నాయిని సిఎం చంద్రబాబు వెల్లడించారు. చంద్రబాబు ఈరోజు పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఫారం7 దుర్వినియోగంలో అడ్డంగా దొరికిపోయిన జగన్.. ఇప్పుడు తన ఓటే తొలగించే ప్రయత్నం జరిగిందంటూ నాటకాలాడుతున్నారని ఆయన అన్నారు. ఇంకా ఎన్నో విచిత్ర వేషాలు జగన్ చూపిస్తారని, వాటిని భరిస్తూ తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.తెలంగాణ నుంచి అక్రమ మార్గంలో వచ్చే ధన ప్రవాహాన్ని పసుపు సైనికులు అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. హెలికాఫ్టర్ గుర్తును చూసి కూడా ఫ్యాన్ గుర్తేమో అని భయపడే పరిస్థితుల్లో జగన్ ఉన్నారని ఎద్దేవా చేశారు. మోడి, జగన్‌, కెసిఆర్‌ అనుబంధం మరోమారు ఈడీ మాజీ డైరెక్టర్ సీబీఐకి రాసిన లేఖ ద్వారా బట్టబయలైందని చంద్రబాబు అన్నారు. ఈ కుట్రను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని సూచించారు.


మరిన్ని తాజా ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/