జగన్‌ విశ్వసనీయత, పోరాట పటిమే వైఎస్‌ఆర్‌సిపి విజయం

Parthasarathi
Parthasarathi

విజయవాడ: భారత దేశ రాజకీయ చరిత్రలో జగన్మోహన్‌రెడ్డి సాధించిన విజయం సాధారణమైనది కాదని పెనమలూరు వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్మే పార్థసారథి అన్నారు. మంగళవారం విజయవాడలో ఆయన వైఎస్‌ఆర్‌సిపి కార్యాలయంలో మాట్లాడుతూ..వైఎస్‌ఆర్‌సిపికి పట్టం కట్టిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల కృషి ఫలితమే ఈ విజయమని అన్నారు. ఈ విజయం వెనుక జగన్‌ విశ్వసనీయత, పోరాట పటిమ ఉందన్నారు.
వైఎస్‌ఆర్‌సిపి లక్ష్యం రాష్ట్ర ప్రయోజనమేనని పార్థసారథి అన్నారు. లోకేష్‌ తీరు ఎలా ఉందంటే..ఏరు దాటాక తెప్పతగలేసే రకంగా ఉందన్నారు. ఓడిపోతే ఓటమి బాధ్యత కార్యకర్తలపై, నాయకులపై వేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబు పాలనలో అవినీతి పెరిగిపోయిందని, మీకు ఎంత మా కుటుంబానికి ఎంత అన్న రీతిలో సాగిందని అన్నారు. ప్రతిపక్ష నాయకులు ఎందరున్నా..ఇంత కష్టపడి , ప్రజలలో ఇంత నమ్మకం తెచ్చుకున్న ఘనత ఒక్క జగన్‌కి మాత్రమే దక్కిందని పార్ధసారథి వ్యాఖ్యానించారు.

తాజా హీరోల ఫోటోగ్యాలరీల కోసం క్లిక్‌ చేయండి: https://www.vaartha.com/photo-gallery/actors/