జగన్‌ మోసగాళ్లకే మోసగాడు

yanamala
yanamala

అమరావతి: ఓటమి భయంతోనే వైఎస్‌ఆర్‌సిపి ఘర్షణ వాతావరణం సృష్టిస్తుందని మంత్రి యనమల రామకృష్ణుడు దుయ్యబట్టారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ..పసుపు-కుంకుమ చెక్కులు చెల్లవని దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చెల్లకపోవడానికి ఇది జగన్‌ దొంగసొమ్ము కాదని మంత్రి యనమల వ్యాఖ్యానించారు. పేదలకు ప్రభుత్వం ఇచ్చే కానుకలని తెలిపారు. బ్యాంకుల్లో రూ. 2,350 కోట్లు డిపాజిట్‌ చేశామని, ఇప్పటికే ఆర్థిక శాఖ రూ. 4,100 కోట్లు విడుదల చేసిందని చెప్పారు. నిర్ధేశిత తేదీల్లో ప్రతి మహిళకు నగదు అందుతుందని ఆయన స్పష్టం చేశారు. జగన్‌ మోసగాళ్లకే మోసగాడని, వైఎస్‌ఆర్‌సిపి చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మవద్దని మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.