జగన్‌ పిటిషన్‌పై హైకోర్టులో మొదలైన విచారణ

High Court
High Court

హైదరాబాద్‌: ఈరోజు హైకోర్టులో కోడికత్తి దాడిపై జగన్ దాఖలు చేసిన పిటిషన్‌పై  విచారణ మొదలైంది. ఇందులో భాగంగా ఆపరేషన్ గరుడని జగన్ తరపు న్యాయవాది ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వం తీరు, పోలీసుల విచారణ హాస్యాస్పదంగా ఉందని, ప్రతిపక్ష నేత జగన్‌పై దాడి జరిగితే కిందిస్థాయి ఉద్యోగులతో విచారణ జరుపుతున్నారని వాదనలో పేర్కొన్నారు. జగన్‌ మెడపై కత్తి తగిలి ఉంటే పరిణామాలు తీవ్రంగా ఉండేవని జగన్ తరపు న్యాయవాది తన వాదనలు వినిపిస్తున్నారు. ప్రస్తుతం హైకోర్టులో వాదనలు కొనసాగుతున్నాయి.