జగన్‌ పాదయాత్ర నేపథ్యంలో డిజిపిని కలిసిన వైఎస్సార్సీ నేతలు

YSRCP flag
YSRCP

మంగళగిరి: ప్రతిపక్షనేత జగన్‌ పాదయారత్ర నేపథ్యలో ఆ పార్టీ నేతలు డిజిపి సాంబశివరావును కలిశారు. గుంటూరు
జిల్లా మంగళగిరిలో రాష్ట్ర పోలీస్‌ శాఖ కార్యాలయానికి వచ్చిన వైఎస్సార్సీపి నేతలు ఈ నెల 6 నుంచి తలపెట్టిన
ప్రజా సంఘాల యాత్ర వివరాలను డిజిపి దృష్టికి తెచ్చారు. కడప జిల్లా ఇడుపులపాయ నుంచి యాత్ర ఆరంభమై
శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు కొనసాగుతుందని తెలిపారు. డిజిపిని కలిసిన వారిలో బొత్స సత్యనారాయణ,
ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, కొలుసు పార్థసారధి తదితరులున్నారు.