జగన్‌ పర్యటించిన ప్రాంతం శుద్ధి చేసిన స్థానికులు

Y S Jagan
Y S Jagan

గుంటూరు: జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో వైఎస్‌ జగన్‌ పాదయాత్ర ముగిసింది. పాదయాత్రలో భాగంగా నిర్వహించిన సభలో జగన్‌ ఆ నియోజకవర్గ టిడిపి ఎమ్మెల్యే శ్రీధర్‌పై విమర్శలు చేశారు. జగన్‌ చేసిన విమర్శలపై శ్రీధర్‌ కూడా స్పందిస్తూ అవినీతి నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్‌ విసిరారు. ఈ నేపధ్యంలో జగన్‌ పర్యటించిన ప్రాంతంలో టిడిపి కార్యకర్తలు పసుపు నీళ్లు చల్లి రోడ్లను శుద్ధి చేశారు. జగన్‌ రాకతో తమ ప్రాంతం మలినమైందని అందుకే శుద్ధి చేశామని తెలిపారు.