జగన్‌ అక్రమాస్తుల కేసులో 2వ అభియోగపత్రం దాఖలు

 

ED
హైదరాబాద్‌: జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇడి ప్రత్యేక కోర్టులో 2వ అభియోగ పత్రం దాఖలైంది. జగన్‌ కంపెనీల్లో అరబిందో, హిటిరో పెట్టుబడులపై ఈ అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. జగన్‌ సహా 19 మందిని ఇడి నిందితులుగా పేర్కొంది. సిబిఐ చార్జిషీటు ఆధారంగా విచరాణ చేపట్టిన ఇడి నిందితులు మనీలాండరింగ్‌కుఏ పాల్పడ్డారని తేల్చింది. అరబిందో, హెటిరో జగన్‌ కంపెనీల్లో రూ.29.50 కోట్లు పెట్టుబడి పెట్టాయి. గతంలో వైఎస్‌ ప్రభుత్వం అరబిందో, హెటిరోలకు 75 ఎకరాల భూమిని కేటాయించింది.