జగన్‌లా నేను మాట్లాడాను

 

JAGAN, PAWAN
JAGAN, PAWAN

విజయవాడ: జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ కడప జిల్లా నేతలతో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రతిపక్ష నేత జగన్‌ మాటాతీరును తప్పుపట్టారు. జగన్‌లా చంపేయండి, చింపేయండని తానెప్పుడూ మాట్లాడలేదన్నారు. ఖనేను ఏ విమర్శ చేసినా ఆదర్శవంతమైన భాషనే ఉపయోగించాననిగ స్పష్టం చేశారు. ఏపీకి దిశానిర్దేశం చేసేందుకే మూడో పక్షంగా జనసేనను స్థాపించానని వివరించారు. రాజకీయాల్లో ఆధిపత్యం కోసం కాకుండా వ్యవస్థలో మార్పుల కోసం జనసైనికులు కృషి చేయాలని పిలుపునిచ్చారు.