జగన్‌పై చర్యలు తీసుకోవాలి: మంత్రి దేవినేని

AP Minister Devineni Uma
AP Minister Devineni Uma

అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్‌ చేసిన వ్యాఖ్యలను మంత్రి దేవినేని
ఉమా తీవ్రంగా ఖండించారు. ఈ వ్యాఖ్యలు జగన్‌ నైజాన్ని తెలుపుతున్నాయని, లక్ష కోట్ల రూపాయలు దోచుకున్న
జగన్‌ నీతి గురించి మాట్లాడటం ఏంటని, ఆవేదనతోనే చంద్రబాబును కాల్చేయాలని వ్యాఖ్యలు చేశానని రెండు
రోజుల క్రితమే ఈసీకి వివరణ ఇచ్చిన జగన్‌ మళ్లీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఈసీ సూమోటోగా తీసుకొని
ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే జగన్‌ మానసిక పరిస్థితి బాగోలేదని, ఆయన హాస్పిటల్‌కు
వెళ్లి చికిత్స తీసుకోవాల్సిన ఆవసరం ఉందని ఆయన ఎద్దేవా చేశారు.