జగన్‌ను కలిసిన ఆమంచి

amanchi meets jagan
amanchi meets jagan

హైదరాబాద్‌: ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ బుధవారం మధ్యాహ్నం వైఎస్‌ఆర్‌సిపి అధినేత వైఎస్‌ జగన్‌ను కలిశారు. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌కు వెళ్లి జగన్‌ను కలిశారు. అనంతరం కృష్నమోహన్‌ విలేకరులతో మాట్లాడుతూ..ఇవాళ జగన్‌ తప్ప రాష్ట్రానికి మరో ఆప్షన్‌ లేదన్నారు. మంచిరోజు చూసుకుని నాతోపాటు నా అనుచరులు వైఎస్‌ఆర్‌సిపిలో చేరతారన్నారు. ఇచ్చిన మాట మీద నిలబడే మనిషి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని, ఆయన వారసుడు..జగన్‌ అందుకే వైఎస్‌ఆర్‌సిపిలో చేరుతున్నానన్నారు.