జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తాం

asaduddin owisi
asaduddin owisi

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం రెండు ఎంపి స్థానాలను కూడా గెలవలేదని, ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల్లో తన స్నేహితుడు, వైఎస్సార్సీ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మద్దతుగా ప్రచారం చేయనున్నట్లు మజ్లిస్‌ అధ్యక్షుడు అసదుద్దిన్‌ ఓవైసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బుధవారం జాతీయ వార్త సంస్థతో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడికి సొంత రాష్ట్రంలోనే వ్యతిరేకత ఉందన్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసినా తెలంగాణాలో ఆ పార్టీకి అనుకూల ఫలితాలు రాలేదన్నారు. తాను అక్కడ ప్రచారంచేస్తే ఆ ప్రభావం ఎలా ఉంటుందో చంద్రబాబుకు తెలుస్తుందని వ్యాఖ్యానించారు.