జగత్‌ సర్వం పైరవీల మయం

                          జగత్‌ సర్వం పైరవీల మయం

Corruption
Corruption

పైరవీ అనే పదానికి దేశంలో ఏ చిన్న పల్లెలోని పౌరు డిని అడిగిన ఠక్కున సవధానం వస్తుంది. దేశంలోని అతి చిన్న పనుల నుండి మొదలుకొని అతిపెద్ద పనుల వరకు పనులు జరగాలన్న రాజకీయ పరమైనటువంటి పదువ్ఞలు పొందాలన్న పైరవీ అనేది అతి ముఖ్యమైన పాత్ర పోషిస్తుందనడం లో ఎలాంటి అతిశయోక్తిలేదు. ప్రపంచ దేశాలలోని గొప్ప ప్రజా స్వామిక దేశంగా పేరొందిన భారత దేశంలో పైరవీ కీలకంగామారి పనులు జరగడంలో ప్రముఖపాత్ర వహిస్తుంది. పైరవీ అనేదిరూపా లలో (వస్తు, ధన, లాభ, స్నేహ, ప్రేమ, బంధుప్రీతి,భయం, న్యాయం) ఉన్నా ఒక పనికోసం పైరవీ జరుగుతుందంటే అక్కడ ఫలాన్ని పొందడానికి అన్ని అర్హతులున్న వ్యక్తికి అన్యాయం జరు గుతుందనటం సర్వసాధారణమైపోయింది.

ఒక్కొక్కసారి అన్ని అర్హ తలు కలిగి వ్ఞన్నా కూడా పైరవీతో పనులు జరుగుతున్నాయనేది కూడా వాస్తవమే. దేశాని అభివృద్ధివైపు, న్యాయంవైపు నడిపించే అధికారులు, అన్యాయానాలను ఎదురించే సంస్థలు, దేశంలోని అత్యున్నత అధికారిక పదవ్ఞలలో ఉన్నవారు సైతం ఎప్పుడో ఒకసారి, ఏదో ఒక సందర్భంలో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పైరవీ బారిన పడుతున్నారనడంలో ఎలాంటి సందేహం అక్కర లేదు. ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాలలోనే కాకుండా కుటుంబాలలోని మానవ సంబంధాల విషయంలో కూడా పైరవీ అనేది సర్వ సాధారణం అనేలా వ్యవహరిస్తున్నది. మన ప్రజాస్వామిక దేశంలో ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలొస్తుంటాయి. ఎన్నో రకాల పార్టీలు, ఎంతో మంది వ్యక్తులు దేశంలో పదవ్ఞలు చేపట్ట డానికి చేయని ప్రయత్నం ఉండదు. ఎన్నికలలో నిలబడాలంటే ముందు పైరవీతో టికెట్‌ సాధించుకోవాలి. ఎందుకంటే పోటీ తీవ్రత కారణం.

దేశంలో అత్యున్నత పదవి చేపట్టాలంటే 130 కోట్లజనాభాలో పాలనానుభవం, కఠోరదీక్ష, కష్టపడే మనస్తత్వం, పట్టుదల, కృషి, ప్రావీణ్యం, తెలివితేటలూ గలవారు కోకొల్లలు. కానీ పైరవీతో తన బలాన్ని బలగాన్ని నిరూపించుకున్న వారే వాటిని చేపట్టడం జరుగుతుంది. వివిధపార్టీలలో నాయకత్వం వహించాలన్న, గల్లీ నుండి ఢిల్లీ వరకు పదవ్ఞలు పొందాలన్నా కూడా పైరవీ జరగాల్సిందే. దేశంలో అధికార పీఠమెక్కాక దేశంలోని పలు ప్రాంతాలలో నామినేటెడ్‌ పోస్టులకు పైరవీల జోరు మాటల్లో చెప్పలేనంత, చేతలలో రాయలేనంతగా ఉంటుం ది. దేశంలోని అతిముఖ్యమైన సంస్థలలో అత్యున్నత అధికారాలన్నీ తన పక్షం గలవారికి అందడం ఒక్క ఎత్తు అయితే వాటిని పైర వీల ద్వారా అధిరోహించడం మరో ఎత్తు.

దేశ ప్రథమ పౌరుడు రాష్ట్రపతి లాంటి పదవ్ఞలు సైతం పొందాలంటే ఆయా పార్టీలోని అధిµనాయకత్వంతో పైరవీ చేసి ఎన్నికలలో పాల్గొనాల్సిన పరిస్థితి నెలకొంది. వివిధ రాష్ట్రాలలో రాష్ట్ర ప్రభు త్వాలు కేంద్రం నుంచి ఆయా రంగాలలో ఎలాంటి ఫలాన్ని ఆశిం చిన, తెలిసిన వ్యక్తుల తో పైరవీలు కొనసాగిస్తేనే తాము అనుకున్న పనులు జరుగు తాయి. దేశస్థాయిలోనే పైరవీల తంతు అలాగుంటే రాష్ట్ర ప్రభు త్వాలలో ఇంకా ఎంతో కీలకంగా ఉంటుందో ఊహించలేమా? రాష్ట్రంలోని ఒక పార్టీ ముఖ్యమంత్రి పదవికి కావాల్సిన మెజారిటీ ని సాధించిన, పైరవీలతో తన బలగాన్ని మెప్పించడం, మెప్పింప చేయడంలో కీలక పాత్ర వహించేది పైరవీనే. ముఖ్య మంత్రి పదవి అధిరోహించిన తర్వాత తనకు అండగా వ్ఞన్న బలగానికి, బలపర్చిన వారికి మంత్రి పదవ్ఞలిచ్చి సంతృప్తి పర్చడం సర్వ సాధారణం.

ఇక్కడికి బాగానే ఉన్నా రాష్ట్రంలోని వివిధ రంగా లలోని సంస్థలలో ఉన్న నామినేటెడ్‌ పోస్టులకు పైరవీలు ఎలా జరుగుతాయంటే ఒక్క పోస్టుకు ఎంత మందిపోటీపడేలాఉంటుంది. కానీ ఆ పదవిని ఒక వ్యక్తికి కట్టబెట్టేటప్పుడు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుంటున్నారనడం అతి ముఖ్యమైన విషయం. సహజంగా రాష్ట్ర ప్రజలు ఆశించేదేమిటింటే ఒక సంస్థకు ఎన్ని కయ్యే వ్యక్తికీ పార్టీలకు అతీతంగా పనిచేస్తూ, సంస్థను అభివృద్ధి దిశలోకి పయనింపచేస్తూ, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా, పట్టుదలతో అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుటకు కఠినమైన నిర్ణయా లు తీసుకుంటూ జవాబుదారీతనంతో పనిచేయగల వ్యక్తిని కోరు కుంటారు. కానీ నేడు ఆ వ్యక్తి, ముందు మన పార్టీకి సంబంధిం చినవాడేనా?

గతంలో మనకు వ్యతిరేక కార్యకలాపాలు ఏమైనా చేశాడా? బలపర్చిన మనుషులెవరు? ఎవరితో పైరవీ చేయిస్తు న్నాడు? అతనికి ఈ పదవి కట్టబెడితే భవిష్యత్‌లో మనకెలాంటి లాభం? పదవి ఇచ్చిన తర్వాత ఒంటెద్దు పోకడతో పోకుండా మన నిర్ణయాలకు కట్టుబడి ఉంటాడా? మన పార్టీ బలో పేతానికి పాటు పడతాడా? మళ్లీ తర్వాత ఎన్నికలలో మనం అధి కారం చేపట్టడ ానికి ఎంతవరకు ఉపయోగపడతాడనే విషయాలను పరిగణనలోకి తీసుకొని పదవిని కట్టబెడుతున్నారనేది వాస్తవం. పైరవీ అనేది కేవలం రాజకీయపరమైన అంశాలకు మాత్రమే పరిమితమైనా బాగుండేది. కానీ అలా కాకుండా వ్యవస్థలోని అన్ని రంగాలలో గల సంస్థలకు పాకి చివరకు విద్యావ్యవస్థలోకి దూరడం అనేది అతి బాధాకరమైన విషయం.

రాష్ట్రాలలోని వివిధ యూనివర్శిటీలో ఉపకులపతి, రిజిస్టార్‌, డీన్‌ నియామకాల్లో ప్రభుత్వాల పాత్ర ప్రత్యక్షంగానో, పరోక్షంగానో పైరవీల పైననే ఆధారపడటమనేది పైరవీల ప్రాధాన్యతను చెప్పకనే చెబుతుంది. ప్రభుత్వ ఉద్యోగ బదిలీలలో, ప్రమోషన్లలో, కొన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాలలో సైతం పైరవీలే ముఖ్యపాత్ర పోషిస్తున్నాయనడంలో వాస్తవం లేదా? సాధారణ మనుషులు సైతం పోలీసు కేసులలో ఇరుక్కుంటే పైరవీలు జరగాల్సిందే. బ్యాంకులో లోన్లు, ప్రభుత్వ ఫలాలు పొందాలంటే పైరవీనే. ఏ చిన్న పని జరగాలన్న చోటా, మోటా నాయకుడితో పైరవీ చేయిస్తేనే అనుకున్న పని జరుగు తుంది. అన్ని అర్హతలు ఉన్నా కూడా ఒక్కొక్కసారి తప్పనిసరిగా పైరవీ చేయించాల్సిన అవసరం ఏర్పడుతుంది.

వివిధ మండలాల్లో గ్రామీణ జనాలకు ఏమైనా పనులు జరగాలన్నా తక్షణమే జరగా లన్నా, పైరవీలే కీలక పాత్ర పోషిస్తున్నాయనడంలో ఎలాంటి సంశయం లేదు. పైరవీ అనేది ఒక మంచి పనినిచేయడానికో, ఒక సంస్థనో, ఒక రంగాన్నో, ఒక రాష్ట్రాన్నో దేశాన్నో అభివృద్ధి దిశకు పయనింపచేసే అంశాలకు పరిమితమైతే మంచిది. అలాగా కుండా తమ స్వంతప్రయోజనాలను పొందడానికి ఉపయోగించి అసలు అర్హత కలిగిన వ్యక్తికీ, సంస్థకు మోసం చేయడమనేది దేశ ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా అభివృద్ధి కుంటుపడటానికి దోహదం చేసినట్లవ్ఞతుంది. పాలక పక్షాలు పైరవీలకు ఎంత త్వర గా స్వస్తి పలికి నిస్పక్షపాతంగా పాలనందిస్తే అంత మంచిది. అర్హతలు, నైపుణ్యాల ఆధారంగా, సవ్యంగా, త్వరితగతిన అభివృద్ధి సూచికంగా పనులు జరిగే సమాజం అవతరించాలని ఆశిద్దాం.
– పొలమ్‌ సైదులు