ఛార్మి తదుపరి విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది: సిట్‌

CHARMI
CHARMI

 

హైదరాబాద్‌: డ్రగ్స్‌ వ్వవహారంలో నేడు ఛార్మికి విచారణ ఉన్న సంగతి విధితమే.
ఆమె అభ్యర్థన మేరకు హైకోర్టు ఆదేశంతో సిట్‌ అధికారులు మహిళ బృందంతో కూడిన
విచారణను చేపట్టింది. కెల్విన్‌ సెల్‌ఫోన్‌లో ఉన్న నంబర్లు, వాట్సాప్‌లో ఛాట్‌ల ఆధారంగా
ఆమెను ప్రశ్నల పరంపర ద్వారా కీలక సమాచారాన్ని రాబట్టినట్లు తెలుస్తోంది. కెల్విన్‌తో
డ్రగ్స్‌ విషయంలో ఆమెకు సంబంధాలు ఏపాటిదో తెలుసుకునేందుకు సిట్‌ అధికారులు
యత్నించారు. ఛార్మి నుంచి ఏ విధమైన శాంపిల్స్‌లను సేకరించలేదు. తదుపరి విచారణకు
పిలిస్తే రావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు, మొదట కుటుంబ నేపథ్యం, చిత్రరంగ ప్రవేశం
వంటి అంశాలపై ప్రశ్నలు సంధించి క్రమంగా మాదక ద్రవ్యాలపై ప్రస్తావించారు.
విచారణ ముగిసిన అనంతరం బయటికి నవ్వుతూ రామడం విశేషం.