ఛాతినొప్పితో ఆసుపత్రిలో ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్‌

Lalu Prasadyadav
Lalu Prasadyadav

పట్నా: బీహార్‌మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్‌యాదవ్‌కు గుండెనొప్పి రావడంతో ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. రాంచిలోని బిర్సాముండాజైలులో శిక్ష అనుభవిస్తున్న లాలూప్రసాద్‌ను రాజేంద్ర వైద్యవిజ్ఞానసంస్థ (రిమ్స్‌)లోని కార్డియాలజీ విభాగానికి తరలించారు. డాక్టర్లుఆయనకు ఇసిజి ఇతర పరీక్షలునిర్వహించారు. ఆయన పరిస్థితి స్థిరంగా ఉన్నదని వైద్యులు తెలిపారు.చ ఆయన పెద్దకుమారుడు తేజ్‌ప్రతాప్‌యాదవ్‌ మరికొందరు సీనియర్‌ ఆర్‌జెడి నాయకులు వందలాదిమంది మద్దతుదారులు ఆసుపత్రికి చేరారు. దాణాకుంభకోణం కేసులో లాలూప్రసాద్‌కు మూడున్నరేళ్ల జైలుశిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా నాలుగవ దాణాకుంభకోణం కేసులో ప్రత్యేక సిబిఐ కోర్టు తన తీర్పును ఈనెల 19వ తేదీకి వాయిదావేసింది. లాలూప్రసాద్‌; మాజీముఖ్యమంత్రి జగన్నాధ్‌మిశ్రాలపై నమోదయిననాలుగో కేసులో 3.13 కోట్ల రూపాయలను దుంకా ట్రెజరీనుంచి రెండుదశాబ్దాలక్రితం అక్రమంగా విత్‌డ్రాచేసారన్న అభియోగాలు వారిపైనమోదయ్యాయి. వరుసగా ఈ కుంభకోణం కేసులో రెండోసారి తీర్పు వాయిదా పడిందని ఆర్‌జెడి చీఫ్‌ కౌన్సెల్‌ ప్రభాత్‌కుమార్‌ వెల్లడించారు.