ఛాంపియన్స్‌ ఫైనల్‌కు టీమిండియా

sp3
Team India

ఛాంపియన్స్‌ ఫైనల్‌కు టీమిండియా

కౌంటన్‌: భారత హాకీ జట్టు అదరగొడుతుంది.కాగా నాలుగవ ఆయా చాంపియన్స్‌ ట్రోఫిలో భాగంగా కౌంటన్‌ వేదికగా కొరియాతో జరిగిన సెమీఫైనల్లో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది.ఆద్యంతం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌ చివరికి 2-2తో డ్రా కాగా తీవ్ర ఒత్తిడి మధ్య జరిగిన షూటౌట్‌ శ్రీజేశ్‌ సేన 5-4తో కొరియాను నిలువరించి ఘనంగా ఫైనల్‌కు చేరుకుంది.ఆతిథ్య మలేసియాతో జరిగిన రెండవ సెమీస్‌లో పాక్‌ విజయం సాధించి పైనల్‌కు చేరితో ఆసక్తిగా ఉంటుంది.చాంపియన్స్‌ ట్రోఫిలో దుర్బేద్యమైన రక్షణ శ్రేణి ఉన్న జట్టు కొరియా,దీంతో లీగ్‌ మ్యాచ్‌లో టీమిండియా 1-1తో డ్రా చేసుకుంది.సెమీఫైనల్‌ మ్యాచ్‌లోనూ భారత్‌ను అడ్డుకునేందుకు కొరియా చాలా ప్రయత్నించింది.అయితే తల్విందర్‌ సింగ్‌ 15 నిముషాల ఆడి గోల్‌ చేసి 1-0తో భారత్‌ను ఆధిక్యంలో నిలిపాడు.ఇన్‌వూ సివో 21 నిముషాలు ఆడి గోల్‌ చేయడంతో ప్రథమార్థం ముగిసే సరికి కొరియా 1-1తో స్కోరు సమం చేసింది.ద్వితీయార్థంలో రెండు జట్లు గోల్‌ కోసం తీవ్రంగా శ్రమించాయి.నాలుగవ క్వార్టర్‌లో వచ్చిన పెనాల్టీ స్టోక్‌లో యాంగ్‌ జి హున్‌ 53 నిముషాలు ఆడి గోల్‌ చేసి 2-1తో భారత్‌ను ఒత్తిడిలోకి నెట్టగా రమణ్‌దీప్‌ 55 నిముషాలు ఆడి చక్కని గోల్‌తో మ్యాచ్‌ను 2-2తో డ్రాగా ముగించాడు.మ్యాచ్‌ డ్రా కావడంతో పెనాల్టీ షూటౌప్‌ అనివార్యమైంది.కాగా షూటాప్‌లో తొలి అవకాశంలో సీనియర్‌ ఆటగాడు సర్థార్‌సింగ్‌ గోల్‌ చేశాడు.ఆ తరువాత రమణ్‌సింగ్‌,రూపెందర్‌సింగ్‌, గోల్స్‌ చేయడంతో స్కోరు 3-3తో సమమైంది. ఆకాశ్‌ దీప్‌ నాలుగవ గోల్‌ చేశాడు. కీలకమైన అయిదవ అవ కాశంలో వచ్చిన పెనాల్టీ స్టోక్‌ను రూపెందర్‌ గోల్‌గా మలిచి 5-4తో భారత్‌ను ఆధి క్యంలోకి తీసుకెళ్లారు. అయిదవ అవకాశంలో కొరియాఆటగాడు లీ డెయిను గోల్‌ కీపర్‌ శ్రీజేశ్‌ మర్థంగాఅడ్డుకొని బంతిని కోర్టు బయటకుపంపించి భారత్‌ను ఫైనల్‌కు చేర్చాడు.