ఛలో అసెంబ్లీ ఉద్రిక్తం

KISHAN REDDY
KISHAN REDDY

ఛలో అసెంబ్లీ ఉద్రిక్తం

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ వ్యతిరేక విధానాలను నిర సిస్తూ బిజెపి కిసాన్‌మోర్చా ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ఛలో అసెంబ్లీ కార్యక్ర మాన్ని పోలీసులు అడ్డుకున్నారు. నాంపల్లిలోని బిజెపి రాష్ట్ర కార్యాలయం నుంచి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు డా.కె. లక్ష్మణ్‌తోపాటు..పార్టీ ఎల్‌పి నేత కిషన్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చింతల రాంచంద్రా రెడ్డి, ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌, ఎమ్మెల్సీ రాం చందర్‌రావు, ఇతర రాష్ట్ర నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చూస్తూ అసెంబ్లీ వైపుకు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు.

అప్పటికే ప్రాంతమంతా భారీ ఎత్తున మోహరించిన వందలాది మంది పోలీసులు కొందరిని పార్టీ ఆఫీసు వద్దనే..మరికొందరని అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో అరెస్ట్‌ చేశారు. ఈసందర్బంగా పోలీసులు, బిజెపి కార్యకర్తల తోపులాటతో కొద్దిసేపు ఈ ప్రాంతమంతా ఉద్రి క్తంగా మారింది. అనంతరం అరెస్ట్‌ చేసిన సదరు బిజెపి నేతలను..సమీప పోలీస్‌స్టేషన్లకు తరలిస్తుండటంతో కార్యకర్తలు అడ్డుకోవడంతో కొద్దిసేపు పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కాగా వ్యవసాయసమస్యలపై ఎప్పటినుంచో సర్కార్‌ను ఎండగడుతూ బిజెపి..తాజాగా చలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. ఒకానొక దశలో పోలీసులు అత్యుత్సాహంతో వ్యవహరించి ఎమ్మెల్యేలను బలవంతంగా పోలీసువ్యాన్‌లో ఎక్కించారు. అపంతరం లక్ష్మణ్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య యుతంగా ఆందోళన చేపడుతున్న తమను అరెస్ట్‌చేసి ఈసర్కార్‌ మరోసారి తన దమన నీతినకి ప్రదర్శించిందని విమర్శించారు.