చ‌ర్చ జ‌రిగితే బిజెపి బండారం బ‌య‌ట‌ప‌డుతుందిః టిడిపి

TDP
TDP

అమ‌రావ‌తిః అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే తమ బండారం బయటపడుతుందన్న భయంతోనే బిజెపి చర్చ అడ్డుకుంటోందని తెలుగుదేశం ఎంపీలు విమర్శించారు. పార్లమెంటు ప్రాంగణంలో వారు మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌ ప్రయోజనాల విషయంలో టిడిపి మాత్రమే చిత్తశుద్ధితో వ్యవహరిస్తోందని అన్నారు. వైఎస్ఆర్‌సిపి ఓ పక్క కేంద్రంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే.. ఆ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో ప్రధాని మోదీ కాళ్లకు మొక్కడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. వైఎస్ఆర్‌సిపి ద్వంద్వ వైఖరిని అందరూ గమనిస్తున్నారనన్నారు. ఎంపీ పదవులకు రాజీనామాలు చేయడం వల్ల ఒరిగేదేమీ ఉండదని… రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేయాలో తమకు తెలుసని అన్నారు. వైఎస్ఆర్‌సిపి నేతలు తమకు సలహాలు ఇవ్వనక్కర్లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి దక్కాల్సిన హామీలు అడుగుతున్నామే తప్ప.. స్వప్రయోజనాల తాము పాకులాడటం లేదని ఎంపీలు స్పష్టం చేశారు.