చైనా భాషలో సచిన్‌ ట్వీట్‌

sachin ,kuldeep
sachin ,kuldeep

న్యూఢిల్లీ: టీమిండియా బౌలర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ శుక్రవారం తన 24వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో కుల్‌దీప్‌కు అభిమానులు, కో ప్లేయర్స్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఐతే కుల్‌దీప్‌కు సచిన్‌ చైనీస్‌ భాషలో ట్వీట్‌ చేయడం విశేషం. చైనిమన్‌ బౌలర్‌కు చైనీస్‌ భాషలో సందేశం పంపుతున్నా. హ్యాపి బర్త్‌డే కుల్‌దీప్‌ యాదవ్‌, భవిష్యత్‌లో నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను అని చైనీస్‌ భాషలో ట్వీట్‌ చేశాడు. కుల్‌దీప్‌ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నాడు.