చైనాలో విజృభిస్తున్న కరోనా..జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఒకే రోజు పదిలక్షల కేసులు

కరోనా మహమ్మారి మళ్లీ బుసలు కొడుతుంది. కరోనా పుట్టినిల్లు చైనా లో మరోసారి తీవ్ర రూపం దాల్చుతుంది. జెజియాంగ్‌ ప్రావిన్స్‌లో ఒకే రోజు పదిలక్షల కేసులు నమోదయ్యాయి. ఒకే రోజులు భారీ మొత్తంలో కరోనా కేసులు నమోదవడం ప్రపంచవ్యాప్తంగా ఆందోళన కలిగిస్తుంది. జెజియాంగ్‌ ప్రావిన్స్‌ చైనా మాన్యుఫ్యాక్చరింగ్‌ హబ్‌.

ఇక్కడ జనాభా దాదాపు రూ.6.5కోట్లు ఉంటారని అంచనా. ప్రావిన్స్‌ ప్రధాన నగరం హాంగ్‌ జౌ.. చైనా ఈ-కామర్స్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌తో పాటు పలు కంపెనీలు ఇక్కడే ఉన్నాయి. ఆపిల్‌తో పాటు జపనీస్‌ వాహన తయారీ సంస్థ నిడెక్‌ సహా తదితర విదేశీ కంపెనీలకు చెందిన తయారీ యూనిట్లు సైతం ఇక్కడే ఉన్నాయి. కరోనా మహమ్మారి విస్ఫోటనంతో ఆయా యూనిట్లలో ఉత్పత్తి ప్రభావం చూపే అవకాశం ఉందని కంపెనీలు ఆందోళన వ్యక్తమవుతున్నాయి.