చైనాపై కఠిన చర్యలు తీసుకుంటాం: ట్రంప్‌

Donald Trump
Donald Trump

వాషింగ్టన్: చైనాపై గతంలో ఎన్నడూ లేనంత కఠిన చర్యలు తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. చైనా పాటిస్తున్న అన్యాయమైన వాణిజ్య పద్ధతులను తొలగించేందుకు అత్యంత కఠిన చర్యలకు దిగుతామని ఆయన పేర్కొన్నారు. ట్రంప్‌ ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌ నుంచి పలుమార్లు చైనా వస్తువులపై దిగుమతి సుంకాలు పెంచుతున్న సంగతి తెలిసిందే. చైనా వల్ల అమెరికాకు బిలియన్ల డాలర్ల ద్రవ్య లోటు ఏర్పడుతోందని, దాన్ని పూడ్చుకోవడానికి సుంకాలు పెంచుతున్నామని గతంలో ట్రంప్‌ తెలిపారు.