చైనాను ముంచెత్తిన కుండపోత వర్షాలు!

floods
ఇంటర్నెట్ డెస్క్ : చైనాలో కురిసిన కుండపోత వర్షాలతో మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గత వారం రోజులుగా కురుస్తున్న కుంభవృష్టికి లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. నదులన్నీ పోటెత్తి ప్రవహిస్తుండటంతో కొన్నిచోట్ల గట్లుతెగి, పలుప్రాంతాలు నీటమునిగిపోయాయి. విద్యుస్తంభాలు నేలకొరిగాయి. చెట్లు, ఇళ్ళు కూలిపోవడంతో పాటు వరదలకు ఊళ్ళకు ఊళ్ళు కొట్టుకుపోతున్నాయి. వరదల్లో చిక్కుకున్నవారిని ప్రభుత్వం ఎప్పటికప్పుడు సహాయం అందిస్తోంది. ఆర్మీ, నౌకాదళాల సాయంతో సహాయక చర్యలు ముమ్మరం చేసింది.