చేరాల్సిన గమ్యం ఇంకా ఉంది

TSCM KCR
TSCM KCR

చేరాల్సిన గమ్యం ఇంకా ఉంది

స మకాలీన రాజకీయాల్ని సరిగ్గా అంచనా వేసి, గతం పునాదులపై నిల బడి వర్తమాన పరిస్థితుల కోణంలో భవిష్యత్‌ చిత్రపటాన్ని ఊహించి అందుకు అనుగుణంగా అడుగులు వేసే నాయకుడే ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా విజయం సాధించ గలుగుతాడు. అటువంటి లక్షణాలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌లో పుష్కలంగా ఉన్నాయని చెప్పవచ్చు. తెలంగాణ రాష్ట్రం ఒక విశాలమైన ప్రాం తీయ ప్రజా ఆకాంక్ష. కె.సి.ఆర్‌కు ముందు, టి.ఆర్‌.ఎస్‌ పుట్టు కకు ముందు కూడా తెలంగాణ ఆకాంక్ష ఉంది.

ఎన్నో పార్టీలు, ఎంతోమంది నాయకులు, మేధావ్ఞలు, కవ్ఞలు, కళాకారులు, గాయకులు, రచయితలు వివిధ ప్రజాసంఘాలు, ఎన్నెన్నో సంద ర్భాల్లో తెలంగాణ ఆకాంక్షల్ని వ్యక్తపరుస్తూ వస్తూనే ఉన్నారు. కానీ పార్లమెంటరీ ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారానే నూతన రాష్ట్రం సాధ్యమవ్ఞతుందన్న ప్రజాస్వామ్య ఉద్యమకారుల ఆశయాన్ని నిజం చేసిన నాయకుడు కె.సి.ఆర్‌.

2001లో కె.సి. ఆర్‌, టి.ఆర్‌.ఎస్‌ పార్టీని స్థాపించి తరువాత ఉద్యమ ప్రస్థానంలో నిరంతరాయంగా సాగిన అనేక ఉద్యమ రూపాల్లో కార్యక్రమాల్లో కేవలం తె.రా.స కార్యకర్తలే కాదు భిన్నాభిప్రాయాలు ఉండి కె.సి.ఆర్‌ను విమర్శించే వాళ్లు సైతం కీలక సమయాల్లో ఆయన తో కలిసి నడవాల్సిన స్థితిలో తెచ్చి ఉద్యమాన్ని నడిపించిన ఘనత ఆయనదే! కచ్చితమైన ఎత్తుగడలు, పకడ్బందీ వ్యూహం, ప్రణాళిక బద్ధంగా సాగించిన కార్యక్రమావళితో గమ్యాన్ని ము ద్దాడి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడంలో కె.సి.ఆర్‌ కృతకృత్యుల య్యానర్నది వాస్తవం. తెలంగాణ రాష్ట్రం వచ్చింది, దశాబ్దాల పాటు పోరాటాలు చేసి త్యాగాల పునాదుల మీద సాధించుకున్న రాష్ట్రం, సకలజనుల స్వప్నాలు, సబ్బండ జాతుల సామూహిక ఆకాంక్షలు సాధిస్తారనే ప్రజల నమ్మకంతో అచెంచల విశ్వాసంతో ఉద్యమ నాయకుడు కె.సి.ఆర్‌ ముఖ్యమంత్రి అయ్యారు. నూతనంగా ఏర్పడిన రాష్ట్ర మైనా, తెలంగాణ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా వడివడిగా అభివృద్ధివైపు అడుగులు వేసే ప్రయత్నం చేస్తోంది. దేశ విదేశాల నుండి అప్పుడప్పుడు, అక్కడక్కడా ప్రశంసలు వస్తున్నాయి. సంతోషం.

కొత్త రాష్ట్రంగా ఎటువంటి బెరుకులేకుండా పరిపా లనలో దూకుడుగా వెళ్లడం ఆశ్చర్యకరమైన విషయమే! తెలంగాణ వస్తే నక్సలైట్ల రాజ్యం, ఉగ్రవాదుల అడ్డా అవ్ఞతుందని, తెలం గాణ వాళ్లకు పరిపాలన సామర్థ్యం లేదని కుక్కలు చింపిన విస్తరి అవ్ఞతుందని, కేవలంసమైక్య ఆంధ్రప్రదేశ్‌లోనే తెలంగాణ రాష్ట్రం బాగుపడిందని బాగుపడుతుందనే పదేపదే వల్లె వేసిన వారికి చెంపపెట్టులాగా స్వరాష్ట్రంలో స్వయంపాలిత తెలంగాణ విమ ర్శకులకు స్పష్టమైన సమాధానం చెబుతోంది. అయినా సరే, ఇంకా ఏదో తెలియని వెలితి. లోటు గోచరిస్తోంది. చేరాల్సిన గమ్యం, సాధించాల్సిన లక్ష్యాలు ఇంకా ఉన్నాయి.

నాలుగేండ్ల పరిపాలన కాలం దగ్గరపడుతున్నా కూడా ఇంకా అమలుకాని, ఆచరణకు నోచుకొని అంశాలు ఎన్నో ఉన్నాయి. ఉద్యోగుల విభ జన అంశం పూర్తికాలేదు.పార్లమెంట్‌ చట్టం అడ్డుపెట్టుకొని ఇంకా ఇక్కడ ఆంధ్రా అధికారుల, ఉద్యోగుల పెత్తనం కొనసాగుతోంది. 48 శాతం కన్నా ఎక్కువే ఇక్కడ ఆంధ్రా ఉద్యోగులు ఉన్నారు. కమలనాథన్‌ కమిషన్‌ పరిధికి రాని ఉద్యోగులు, షిలాబిడే కమి టీకి ఉందని ఆంధ్రా ఉద్యోగులు లక్షల్లో ఇంకా ఇక్కడ ఉన్నారు. ఈ అంశం గురించి ఎవరూ పట్టించుకునే పరిస్థితి లేదు. ఆంధ్రాలో పనిచేస్తున్న తెలంగాణ ఉద్యోగులను రప్పించుకోవడం ఎంత ముఖ్యమో తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులను వెనక్కిపంపడం అంతే ముఖ్యం. పార్లమెంట్‌ బిల్లు ప్రతులను కాళ్లతో తొక్కినవారు, కె.సి.ఆర్‌ తెలంగాణ చిత్రపటాలను తగల బెట్టినవారు ఈ రోజు సచివాలయంలో డైరెక్టరేట్‌లలో చక్రం తిప్పుతుంటే బాధకలిగిస్తోంది. కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి కాని ఇప్పటికి అంతా అస్తవ్యస్తంగా ఉంది. ఉద్యోగులకు సంబంధించి ఇంకా శాశ్వత కేటాయింపులు జరగలేదు.అన్ని శాఖల్లో ఉద్యోగుల బదిలీ ప్రక్రియ మొదలుకాలేదు.

ఉద్యోగాల భర్తీ ప్రక్రియ వేగవం తం కావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ఉద్యమంలో కీలకం గా పాల్గొని, తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని బలంగా నమ్మిన కాంట్రాక్ట్‌ ఉద్యోగుల వారి జీవితాశయం క్రమ బద్దీకరణ ఏ మాత్రం ముందుకు సాగడంలేదు. తెలంగాణ రాష్ట్రం లో అన్ని రకాల కాంట్రాక్ట్‌ ఉద్యోగులను టి.ఆర్‌.ఎస్‌. రెగ్యులరైజ్‌ చేస్తున్నదనే స్పష్టమైన హామీని ఆ పార్టీ పలు వేదికలపై తీర్మానం చేయడమే కాకుండా 2014 ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నది. కె.సి.ఆర్‌ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొట్ట మొదటి క్యాబినెట్‌లో కాంట్రాక్ట్‌ ఉద్యోగుల రెగ్యులరైజ్‌ చేస్తూ తీర్మానాలు చేసింది.

ఇప్పటివరకు అమలుకు నోచుకోకపోవడం కాంట్రాక్ట్‌ఉద్యోగులకు,వారికుటుంబాలకు బాధకలిగిస్తున్న అంశం. ప్రజలు తమ బాధల్ని ఎవరికి విన్నవించుకోవాలో, ఎక్కడికి వెళ్లి తమ బాధలను వెళ్లకక్కుకోవాలో తెలియని స్థితి. ఇది ఏమాత్రం క్షేమం కాదు. తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడం ఎంత అవసర మో, సాధించుకున్న తెలంగాణ పునఃనిర్మాణం అంతే బాధ్యతా యుతమని సొంత రాష్ట్రంలో ప్రజలు ఆశించిన అభివృద్ధిని సాకా రం చేసి, అభివృద్ధి ఫలాలను యావత్‌ తెలంగాణా జాతికి పంచ డమే ఉద్యమ లక్ష్యమని ఆనాడు ప్రకటించుకున్నాం. ఆ దిశగా అడుగులు వేయాలనే ప్రయత్నం కూడా సాగుతోంది.

కాదనలేం. కాని ఇంకా గమ్యాన్ని చేరవలసిన అవసరం ఉంది. హామీలు అలాగే ఉండిపోయాయి.ఉద్యమ సమయంలో ఆశించిన సమాజా న్ని సాక్షాత్కరించుకోవాల్సిన దిశగా ఇకనైనా ఆలోచించాలి. ఉద్యమ సమయంలో ఇచ్చిన వాగ్దానాలు, ఉద్యమంలో పాల్గొన్న వారి ఆశలు, అందులో అమలుకాని అంశాలు ఆకాంక్షల వైపు దృష్టిసారిస్తే నెరవేరిస్తే కె.సి.ఆర్‌కు ఎదురులేదు. ఆయన పార్టీకి తిరుగులేదు. కనీసం చివరి సంవత్సరంలోనైనా ఆ దిశగా ఆలో చించాల్సిన అవసరం ఎంతైనాఉంది. హామీల అమలును వేగవం తం చేయాల్సిన అవశ్యకత కనబడ్తోంది.

– సురేష్‌ కాలేరు
(రచయిత: రాష్ట్ర సహ అధ్యక్షుడు, తెలంగాణ ఉద్యోగుల సంఘం)