చేపల చెరువుల పేరిట దగా

FISH-
FISH-

చేపల చెరువుల పేరిట దగా
డిబిఐ బ్యాంకులో భారీ కుంభకోణం!

విశాఖపట్నం: బడా బాబులకు, తిండికి గతిలేని వ్యక్తులకు కూడా బ్యాంకులు రెడ్‌ కార్పెట్‌ పరిచి మరీ రుణాలు మంజూరు చేస్తున్నాయి. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో ఇటు బ్యాంకు అధికారులు, అటు దగాకోరులు కూడా వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే కొన్ని బ్యాంకులను నిండా ముంచేసిన దగాకోరులు తాజాగా ఐడిబిఐ బ్యాంకులో చాప కింద నీరులా భారీ కుంభకోణానికి తెర తీశారన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి. తెలుగు రాష్ట్రాలైన ఎపి, తెలంగాణాలో చేపల చెరువుల పేరిట ఈ దగాకు పాల్పడినట్టు తెలుస్తోంది. చేపల చెరువులు లేకుండానే కోట్లాది రూపాయల రుణాలను అక్రమ మార్గంలో మంజూరు చేశారన్న ఆరోపణలు గుప్పు మంటున్నాయి. ముందుగా తెలంగాణాలో ఈ కుంభకోణానికి సంబం ధించి ప్రాథమిక దశలోనే బ్యాంకు ఉన్నతస్థాయి అధికారులు గుర్తించి సిబిఐకి ఫిర్యాదు చేసినట్టు విశ్వసనీయంగా తెలిసింది. ఈమేరకు తెలంగాణాలో దర్యాప్తు చేపట్టిన అక్కడి సీబీఐ అధికారులకు దాని మూలాలు ఏపీలో కూడా ఉన్నట్టు గుర్తించినట్టు తెలుస్తోంది.