చేపలే మేలు

fisths
Fish Curry

చేపలే మేలు

ఎక్కువకాలం జీవించాలని కోరుకుంటున్నారా? అయితే తరచూ చేపల్ని తినండి. ఎందుకంటే వీటిల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ మీ ఆయుష్షు పెరగటానికి దోహదపడుతుందని పరిశోధకులు చెప్తున్నారు.

రక్తంలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ శాతం తక్కువ్ఞన్న వారికన్నా ఎక్కువ్ఞన్న వారు రెండేళ్లకు పైగా ఎక్కువగా జీవిస్తున్నారని తాజా అధ్యయనాల్లో తేలింది. అలాగని చేపనూనె మాత్రలు వేసుకుంటే సరిపోతుందిలే అనుకునేరు. ఆహారం ద్వారా లభించే ఒమేగా-3ఫ్యాటీ యాసిడ్స్‌తోనే ప్రయోజనం అధికమని హార్వర్డ్‌ స్కూల్‌ ఆఫ్‌ పబ్లిక్‌ హెల్త్‌కు చెందిన పరిశోధకులు చెప్తున్నారు. గుండె సంబంధిత మరణాల ముప్పు తగ్గిస్తుందంటున్నారు. ఈ కొవ్ఞ్వ అధికంగా ఉండే వారిలో మరణాల శాతం 27% తక్కువని చెప్తున్నారు. చేపల్లో గుండెకు మేలు చేసే ప్రొటీన్‌, కొవ్ఞ్వ ఆమ్లాలు దండిగా ఉంటాయి. చేపల్ని అధికంగా మన ఆహారంలో భాగంగా చేసుకుంటే గుండె జబ్బులేనట్లేనని ఈ అధ్యయనాల్లో తేలింది. అయితే ఇతర కారణాలతో వచ్చే మరణాలపై దీని ప్రభావం ఎలా ఉంటుందో అధ్యయనం చేయాల్సి ఉందని వారు చెప్తున్నారు.
ఈ అధ్యయనం అల్లాట ప్పాగా చేసింది కాదు. 16ఏళ్ల పాటు వ్యక్తుల్ని బట్టి కాకుండా ఒమేగా- 3 ఫ్యాటీ ఆసిడ్స్‌ స్థాయిల్ని లెక్కించి మరీ చేసింది. అధ్యయనంలో పాల్గొన్న వారిలో ఒమేగా కొవ్ఞ్వలు ఎక్కువగా ఉన్నవారు పండ్లు, కూరగాయలు బాగానే తీసుకున్నారట. అందువల్ల పరిశోధకులు చేపలతో పాటు పండ్లూ,కూరగాయాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని అంటున్నారు. వారానికి రెండుసార్లు 100గ్రా చొప్పున చేపల్ని తింటే మన శరీరానికి కావాల్సిన ఒమే గా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ అందుతాయని ఈ నిపుణుల సూచన. శాకాహారులు అవిసెగింజల వంటి కొవ్ఞ్వ ఉన్న పదార్థాల్ని తీసుకుంటే సరిపోతుంది.