చేనేత పార్కును ప్రారంభించిన కేటీఆర్‌

ktr
ktr

జోగులాంబ గ‌ద్వాలః మంత్రి కేటీఆర్ ఇవాళ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా గద్వాల్ మండలం గూడూరులో ఆయన పలు పనులకు శంకుస్థాపన చేశారు. రూ. 40 కోట్ల విలువైన చేనేత పార్కు, మౌలిక సదుపాయాలు, పరిపాలన విభాగం భవన నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
అనంతరం… కలెక్టరేట్‌లో నివేదన స్పందన గ్రీవెన్స్ రిడ్రెస్సల్ యాప్‌ను కేటీఆర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, ల‌క్ష్మారెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, కలెక్టర్ రాజత్ కుమార్ సైనీ పాల్గొన్నారు.