చేనేతకు అన్ని విధాలా అండగా ఉంటాం

TS Minister KTR
KTR

రాజన్న సిరిసిల్ల: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు అన్ని విధాలా అండగా ఉంటామని మంత్రి కేటిఆర్‌ స్పష్టం చేశారు. సిరిసిల్ల కాటన్‌ వస్త్ర పరిశ్రమ ఉత్పత్తిదారుల ఆత్మీయ సమ్మేళనంలో కేటిఆర్‌ పాల్గొని ప్రసంగించారు. చాలా మంది నేతలకు పవర్‌లూమ్‌, చేనేత అంటే ఏమిటో కూడా తెలియదు అని ఆయన ఎద్దేవా చేశారు. గుజరాత్‌ కాటన్‌ కంటే తెలంగాణ కాటన్‌ బాగుందని ఇప్పటికే కొంత మంది నిపుణులు చెప్పారు. కార్మికులు ఎదిగేందుకు అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్నాం. దీర్ఘకాలంగా వేధిస్తున్న సమస్యలను తక్కువ సమయంలో పరిష్కరించుకున్నామని కేటిఆర్‌ స్పష్టం చేశారు.