చేజేతులా ఓడిన భారత్‌

INDIAN HOCKEY TEAM
INDIAN HOCKEY TEAM

హాకీ ప్రపంచ లీగ్‌ ఫైనల్స్‌ టోర్నీ
చేజేతులా ఓడిన భారత్‌

న్యూఢిల్లీ: భువనేశ్వర్‌ వేదికగా జరుగుతున్న హాకీ ప్రపంచ లీగ్‌ ఫైనల్‌ టోర్నీలో ఆతిథ్య భారత్‌ రెండో మ్యాచ్‌లో అభిమానులను నిరాశ పరిచింది. తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాను కంగారెత్తించిన భారత్‌…ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో చేజేతులా ఓటమి పాలైంది. కనీసం డ్రాగా ముగించాల్సిన మ్యాచ్‌ను భారత్‌ చేజార్చుకుంది. దీంతో మ్యాచ్‌ను 2-3తేడాతో ఓడిపోయి పూల్‌-బిలో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. భారత్‌ తరుపున ఆకాశ్‌దీప్‌ (47ని), రూపిందర్‌పాల్‌ (50ని)గోల్స్‌ చేశారు. మరోవైపు ఇంగ్లాండ్‌ జట్టులో సామ్‌ వార్డ్‌ (43ని, 57ని) డబుల్‌ గోల్స్‌తో విజృంభించగా, చివర్లో డేవిడ్‌ గుడ్‌ఫీల్డ్‌ (25ని) మరో గోల్‌ చేశాడు. టోర్నీలో భాగంగా సోమవారం చివరి మ్యాచ్‌లో భారత్‌ జర్మనీతో తలపడనుంది. మ్యాచ్‌ ప్రారంభం నుంచే ఇరు జట్లు హోరా హోరీగా తలపడటంతో తొలి క్వార్టర్‌లో ఎలాంటి గోల్‌ నమోదు కాలేదు. ఇక రెండో క్వార్టర్‌లో భారత్‌ స్ట్రైకర్లు ఎస్‌వి సునీల్‌, మణ్‌దీప్‌ సింగ్‌ తమకు అందివచ్చిన పాస్‌లను గోల్స్‌గా మలువ లేకపోయారు. అదే సమయంలో ఇంగ్లాండ్‌ భారత డిఫెన్‌్‌సపై ఒత్తిడి పెంచి ఫలితం రాబ ట్టింది. రెండో క్వార్టర్‌ 25వ నిమిషంలో దక్కిన ఫెనాల్టీ కార్నర్‌ను గుడ్‌ఫీల్డ్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 1-0 ఆధిక్యంలో వెళ్లింది. ఆ తర్వాత 43వ నిమిషంలో ల్యూక్‌ టేలర్‌ లాంగ్‌ పాస్‌ను హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ సరిగ్గా నిలువరించలేక పోయాడు. దీనిని అనుకూలంగా మలుచుకున్న సామ్‌ వార్డ్‌ గోల్‌ చేయడంతో ఇంగ్లాండ్‌ 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది. ఆతర్వాత భారత్‌కు వెంట వెంటనే రెండు ఫెనాల్టీ కార్నర్లు దక్కిన ప్పటికీ గోల్స్‌గా మలచడంతో విఫలమయ్యారు. ===