చెలి చిట్కా

oil
Oil

చెలి చిట్కా

 

+ సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ రిఫైన్‌ చేయడం వల్ల ఇందులో కొవ్ఞ్వ శాతం తక్కువగా ఉంటుంది. గుండెజబ్బులున్నవారు, స్థూల కాయులు ఈ నూనెను వాడడం మంచిది. ఈ నూనెలో విటమిన్‌ ఎ,డి,ఇలు ఉన్నాయి.

పిండివంటలు చేయటానికి ఉపయోగించడం వల్ల నూనె కాగినప్పుడు పొంగదు. ఆరోగ్యానికి ఈ నూనె వాడటం చాలామంచిది. ఆయిల్‌ పుల్లింగ్‌కు ఉపయోగపడుతుంది.

కడుపుబ్బరం ఉన్నప్పుడు ఆముదం పొట్టపై రాసుకుని వేడినీటితో కాపు పెట్టుకోండి. ఎండించిన అల్లంపొడి, వాముపొడి, ఉప్పు పొడి, నిమ్మరసంతో కలిపి గోరువెచ్చని నీళ్లతో ఉదయంపూట, సాయంత్రం పూట తీసుకోండి.

కుమాగ్రాసనం మూడు చెంచాల మందు, మూడు చెంచాల నీరు కలిపి సాయంత్రం తీసుకుంటే కడుపులో గ్యాస్‌ ఉన్నవారికి హితకరం.