చెలి కానుక

COOKINGf
COOKINGf

చెలి కానుక

సుగంధ ద్రవ్యాలను వేయించి పొడిచేసి కూరల్లో వేస్తే రుచిగా ఉంటుంది. పొడి ఎక్కువరోజులు నిల్వ ఉంటుంది.

కూరగాయలు తరిగే బల్లను ఎప్పటికప్పుడు నిమ్మ చెక్కతో రుద్ది కడిగితే హానిచేసే క్రిములు దూరమవుతాయి.

నిమ్మచెక్కలను ఎండబెట్టి పొడిచేసి అందులో నాలుగు చుక్కల వెనిగర్‌ కలపండి. దీన్ని కిటికి అద్దాలకు రాసి తుడిస్తే మరకలు తొలగిపోతాయి.

గాజు, ఇత్తడిపాత్రలపై ఉండే స్టిక్కర్లను తొలగించాలంటే…వాటిపై కొద్దిగా వంట నూనె రాస్తే సరిపోతుంది.