చెలి కానుక

nail polish
nail polish

చెలి కానుక

కొబ్బరి తురిమి గుడ్డలో వేసి పిండి ఆ పాలను తలకు రాసి దువ్వెనతో బాగా దువ్వాలి. మూడు గంటల తరువాత సీకాయితో కాని, షాంపూతో గాని తలస్నానం చేస్తే జుట్టు రాలటం ఆగి ఒత్తుగా పెరుగుతుంది.

మెడ ఎక్కువగా చమట పడుతుంటే మీరు నగలు ధరించాలంటే ఇబ్బంది ఉంటుంది కదా? అటువంటప్పుడు ఆస్ట్రింజెంట్‌ లోషన్‌ని దూదితో తీసుకుని మెడకు రాసి ఐస్‌క్యూబ్స్‌తో రబ్‌ చేయండి. తరువాత టవల్‌తో మెత్తగా తుడుచుకోవాలి.

వెన్నపూసలో నిమ్మరసం, రోజ్‌వాటర్‌ కలిపి చేతులకు మసాజ్‌ చేస్తే చేతులు మృదువ్ఞగా ఉంటాయి. మోకాళ్లకు రాస్తే నల్లమచ్చలు త్వరగా తగ్గుముఖం పడతాయి.

ఎండిపోయి గడ్డకట్టిన బూట్‌పాలిష్‌లో కొన్నిచుక్కలు ఆలివ్‌ ఆయిల్‌ను కలిపితే పాలిష్‌ మామూలుగా తయారవుతుంది. నిమ్మ, దబ్బ, మామిడి లాంటి పుల్లటి కాయలను తరిగితే కత్తిపీట పదునెక్కుతుంది.

ఖాళీ అయిన టానిక్‌ సీసాలలో టానిక్‌ వాసన పోవాలంటే యాలుక తొక్కలను అందులో వేసి రెండు రోజులు ఉంచి తరువాత కడగాలి. ్య నెత్తురు మరకలు పడిన దుస్తులను ఉప్పు నీటిలో నానబెట్టి ఆ తరువాత సబ్బుతో ఉతికితే మరకలు పోతాయి. అలాగే సిరామరకలకు కొద్దిగా కిరసనాయిల్‌ వేసి నానబెట్టి అరగంట తర్వాత ఉతికితే పోతాయి.

పాత సాక్స్‌లో పాత దుస్తులు పారేయకుండా కలిపి కుడితే నేల శుభ్రపరచుకునే బట్ట తయారవ్ఞతుంది. ్య పాతబడిన దిండు, కుషన్‌ కవర్స్‌, బెల్ట్‌లు పడేయకుండా ఆ కవర్లకి రెండు పక్కలా పాతబెల్ట్‌ వేసి కుట్టేస్తే భుజానికి తగిలించుకునే సంచి తయారు. ఆ బ్యాగులు అలమారులో తగిలించుకుంటే సాక్స్‌, జేబురుమాళ్లు నిలవ చేసుకుని అవసరమైనప్పుడు గుర్తుగా తీసుకోవటానికి బాగుంటాయి. ్య మందపాటి బట్టని పెన్నులు, పెన్సిల్లు వాడుకునే మగ్‌లో అడుగున వేస్తే పెన్సిల్స్‌, పెన్నుల పాయింట్‌ ఉన్న వైపు లోపల వేస్తే అడుగు భాగం మెత్తగా ఉండి పాయింట్‌ పాడవకుండా కాపాడుతుంది. సిరామరకలు అయినా బట్టని మారిస్తే సరిపోతుంది.