చెన్నై లోనే శ్రీదేవి ప్రథమ వర్ధంతి!

SRIDEVI
SRIDEVI

ముంబై: వెండితెరపై ఒక వెలుగు వెలిగిన తార శ్రీదేవి. ఎన్నో చిత్రాల్లో నటించి అందరి ఆదరాభిమానాలను సొంతం చేసుకున్న శ్రీదేవి చనిపోయి అప్పుడే సంవత్సరం కావస్తుంది. దుబా§్‌ులోని హోటల్‌లోని బాత్‌టబ్‌లో మునిగి శ్రీదేవి హఠాన్మరణం చెందింది. ఫిబ్రవరి 24, 2018న శ్రీదేవి మరణించిన సంగతి తెలిసిందే. మరికొద్దిరోజుల్లో ఆమె మరణించి ఏడాది కావస్తుండడంతో కుటుంబసభ్యులు ఆమె ప్రథమ వర్ధంతిని శ్రీదేవికి నచ్చిన చెన్నై నగరంలోని తన సొంత ఇంట్లేనే జరపాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఆ రోజు నిర్వహించే ప్రత్యేక పూజలో శ్రీదేవి కుటుంబ సభ్యులతో పాటు, పలువురు సినీ ప్రముఖులు కూడా పాల్గొననున్నారని చెబుతున్నారు.