‘చెన్నై చిన్నోడు’ టీజర్‌ విడుదల

chennai chinnodu
chennai chinnodu

జివి ప్రకాష్‌ కుమార్‌, నిక్కీ గల్రానీ జంటగా నటించిన ఓ తమిళ చిత్రాన్ని తెలుగులో చెన్నై చిన్నోడు , అనే టైటిల్‌తో శూలిని దూర్గ ప్రొడక్షన్స్‌ పతాకంపై వి.జయంత్‌కుమార్‌ తెలుగులో అనువదిస్తున్నారు. యశ్వంత్‌ సాయికుమార్‌ సమర్పకుడు. ఎం.రాజేష్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ఈసినిమా టీజర్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ ఆవిష్కరణ కార్యక్రమం ఆదివారం జరిగింది. ముఖ్యఅతిథిగా నిర్మాత కెవి సత్యనారాయణ, టీజర్‌, ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో నిర్మాత వి.జయంత్‌కుమార్‌, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ ఎన్‌.కృష్ణ, పాటల రచయిత సిహెచ్‌ పూర్ణాచారి తదితరులు మాట్లాడారు.