చెత్త నుంచి గ్యాస్‌ ప్లాంట్‌ వరకు..


శృతిది వ్యాపార కుటుంబం. అందుకే తనకు చిన్నప్పటి నుండే వ్యాపారం మీద ఆసక్తి పెరిగిందంటుంది. చదువుకునేందుకు అమెరికా వెళ్లి వచ్చాక ఆమెకు ఈ ఆలోచన వచ్చింది. అమెరికాలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లో మాస్టర్స్‌ చేసిన శృతికి అక్కడే ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాని తన చదువు మనదేశానికిఉపయోగపడాలనుకుంది.

biogas
biogas
సాధారణంగా కూరగాయలు, పండ్ల నుంచి వచ్చే చెత్తను పడేస్తాము. లేదా వీటి నుండి ఎరువును తయారు చేసే వారికి ఇస్తారు. అయితే శృతి ఆహుజా వంటింటి చెత్తతో వంట గ్యాస్‌, విద్యుత్‌ అందించే యంత్రాలను తయారు చేస్తున్నారు. స్వచ్ఛభారత్‌ ప్రతిచోట వినిపిస్తున్నది. తన వ్యాపారం కూడా అలాగే సాగుతోందంటున్నారు హైదరాబాద్‌కు చెందిన శృతి ఆహూజా. వంటింటి చెత్త నుంచి బయోగ్యాస్‌, విద్యుత్‌ని అందించే యంత్రాలను రూపొందిస్తూ జిహెచ్‌ఎమ్‌సి వంటి పెద్ద పెద్ద సంస్థలకు సేవలందిచే స్థాయికి ఎదిగారు. ఆసుపత్రులు, పెద్ద పెద్ద హోటళ్లు, క్యాంటిన్లు, అన్నదాన సత్రాలు, మార్కెట్‌ యార్డుల నుండి పెద్ద స్థాయిలో పండ్లు, కూరగాయల వ్యర్థాలను సేకరిస్తారు. అలాంటి చోట్ల యంత్రాలను అమర్చితే బయోగ్యాస్‌తో పాటు విద్యుత్‌ కూడా ఉత్పత్తి అవుతుందన్న లక్ష్యంతో ఉన్నారామె. శృతిది వ్యాపార కుటుంబం. తండ్రి ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ సర్వీసెస్‌కి సంబంధించిన వ్యాపారం. అందుకే తనకు చిన్నప్పటి నుండే వ్యాపారం మీద ఆసక్తి పెరిగిందంటుంది. చదువుకునేందుకు అమెరికా వెళ్లి వచ్చాక ఆమెకు ఈ ఆలోచన వచ్చింది. అమెరికాలో ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ లో మాస్టర్స్‌ చేసిన శృతికి అక్కడే ఒక మల్టీనేషనల్‌ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కాని తన చదువు మనదేశానికి ఉపయోగపడాలనుకుంది. అందుకే 2011లో ఇండియా వచ్చేసింది. ఏదైనా చేయాలని ఆలోచిస్తున్న సమయంలో పౌల్ట్రీ నుంచి వచ్చే వ్యర్థాలతో గ్యాస్‌, విద్యుత్‌ తయారు చేయవచ్చని తెలుసుకుంది. ఆ విషయాన్ని తండ్రికి వివరించడంతో ఆయన ఒప్పుకుని ఆర్ధికంగా అండగా ఉంటానని కూడా మాట ఇచ్చారు. దేశంలోని చాలా చోట్ల పౌల్ట్రీ వ్యర్ధాలను వృధాగా పడేయం గమనించింది. ఈ వ్యర్ధాల్లో అమోనియా ఉంటుంది. దుర్వాసన వస్తుంది. దాంతో అనారోగ్యాలు వస్తాయి. ఈ విషయాలన్నీ రైతులుకు చెప్పి వ్యర్థాలతో గ్యాస్‌, విద్యుత్‌ తయారు చేయవచ్చని వారికి విశదీకరించింది. వారికి ఒక వీడియో ద్వారా డెమో కూడా ఇచ్చింది. దాంతో రైతులు పౌల్ట్రీల వద్ద బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు అంగీకరించారు. దాంతో సొంతంగా బయోగ్యాస్‌ ప్లాంట్‌ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. దాదాపు ఆరేడు నెలల పాటు రకరకాల పరిశోధనలు, అధ్యయనాల అనంతరం ప్లాంటును రూపొందించింది. కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో పవర్‌ప్లాంట్‌ ఏర్పాటుకు అవకాశమివ్వ డంతో రైతులు అటు మొగ్గు చూపారు. అయితే రైతులు ఏదోలా మేలు జరిగిందిలే అనుకుని మరో ఆలోచనకు శ్రీకారం చుట్టింది. వ్యాపారం అన్నాక ఇవన్నీ సహజమే అనుకుని వంటింటి వ్యర్ధాల మీద దృష్టి పెట్టింది. గోబర్‌ గ్యాస్‌ ఇప్పటికే వాడుకలో ఉంది. ప్రస్తుతం వంటింట్లో వెలువడే కూరగాయలు, పండ్ల వ్యర్థాల నుంచి బయోగ్యాస్‌, విద్యుత్‌ తయారు చేయడం మీద దృష్టి నిలిపింది. పల్లెల్లో అయితే ఈ చెత్తంతా రైతులు ఎరువుగా మార్చి పంటపొల్లాల్లో ఉపయోగిస్తారు. పట్టణాల్లో పెద్ద పెద్ద హోటళ్లు, క్యాంటిన్లు, మార్కెట్‌ యార్డుల వాళ్లు రోడ్ల పక్కన డంపింగ్‌యార్డు వద్ద పడేస్తారు. అలా కాకుండా ఈ చెత్త నుంచి వంట గ్యాస్‌ అందించాలని 2014లో కొత్త ప్లాంట్‌ను తయారు చేసింది. పాఠశాలల పిల్లలకు ఆహారం అందించే అక్షయపాత్ర నిర్వాహకులకు తన ఆలోచన చెప్పింది. వాళ్లు అంగీకరించి కిచెన్‌లో యంత్రాన్ని ఏర్పాటు చేసేందుకు అవకాశమిచ్చారు. అలా మార్కెట్‌ యార్డులు, క్యాంటీన్లు, సాఫ్ట్‌వేర్‌ సంస్థలు, ఆసుపత్రులు, కాలేజీల వంటశాలలో బయోగ్యాస్‌ ప్లాంట్లు ఏర్పాటు చేసింది. ఎల్‌పిజి అవసరం లేనివారు వీటిని ఏర్పాటు చేసుకుని వృథాను విద్యుత్‌గా మార్చుకుంటున్నారు. అదే పెద్ద స్థాయిలో వంటింటి చెత్త ఉత్పన్నమయ్యే క్రమంలో గ్యాస్‌ని నిల్వ చేసుకోవచ్చు. చెత్త వేసే సామర్ధ్యాన్ని బట్టి రోజుకు 250 నుండి 300 కేజీల వ్యర్థాలతో గ్యాస్‌ లేదా విద్యుత్‌ను ఈ ప్లాంట్‌లు ఉత్పత్తి చేస్తాయి.

తాజా ఏపి బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/