చెడు క్రిములతో అంటువ్యాధులు

Cold111
Cold

చెడు క్రిములతో అంటువ్యాధులు

దేహానికి అపకారాన్ని కలుగజేసే సూక్ష్మక్రిములు (వీటిని పాథోజెన్స్‌ అంటారు) శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఇన్‌ఫెక్షన్‌ కలుగుతుంది. పాథోజెన్స్‌లో ఈ కింది రకాలుంటాయి. బాక్టీరియా, వైరస్‌, ప్రోటోజోవా, రికెట్సియే, ఫంగస్‌, పురుగులు మొదలైనవి. ఈ అన్ని రకాల క్రిములు ఒక మనిషి నుంచి మరొక మనిషికి అనేక మార్గాల ద్వారా అంటు (సోకు)తూ ఉంతాయి.

ఉదా హరణకు- ఒకవ్యక్తి దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు గాలిలోకి విరజిమ్మబడే తుంపరను అవతలి వ్యక్తి పీల్చడం కొన్ని క్రిములు ముద్దు ద్వారా, సంభోగం ద్వారా ఒకరినుంచి మరొకరికి వ్యాపిస్తాయి. దోమల ద్వారా ప్రోటోజోవా రకానికి చెందిన ప్లాస్మోడియం అనే మలేరియా క్రిములు ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. పక్షుల ద్వారా, చిలకల ద్వారా సిట్టాకోసిస్‌ అనే బాక్టీరియా సోకుతుంది. కలుషితమైన ఆహారం, నీరు, మట్టిలో కొన్ని విష క్రిములుం టాయి. ఇవి నోటి ద్వారా, గాయాల ద్వారా శరీరంలోకి ప్రవేశి స్తాయి. కొన్ని విషక్రిములు తల్లి ద్వారా గర్భధారణ సమయంలోనూ, ప్రసవ సమయంలోనూ బిడ్డకు సోకుతాయి.

పొదగబడే కాలం :
మనకు అపకారాన్ని కలుగజేసే క్రిములు ఒకసారి శరీరంలోకి ప్రవేశించాకా అవి తమ ఉత్పత్తిని పెంచుతూ వృద్ధి చెంద నారం భిస్తాయి. అయితే అవి శరీరం మీద ప్రభావాన్ని చూపుతూ తమ లక్షణాలను ప్రదర్శించటానికి కొంత సమయం పడుతుంది. క్రిములు శరీరంలోకి ప్రవే శించి లక్షణాలను ప్రదర్శించడం ప్రారంభించే వరకూ ఉండే కాలాన్ని పొదగ బడే కాలం లేదా ఇంక్యుబేషన్‌ పీరియడ్‌ అని వ్యవహరిస్తారు. ఒక మనిషికి అంటు వ్యాధి సోకినప్పుడు అతని శరీరం ఆ ఇన్‌ఫెక్షన్‌ మీద పోరాటాన్ని సల్పటానికి తనలో కొన్నియాంటీబాడీస్‌ను అభివృద్ధి చేసుకుంటుంది. ఆ వ్యాధి తగ్గాకా కూడా ఆ యాంటిబాడీస్‌ అతడి శరీరంలో నిలువ ఉండి, మళ్లీ అలాంటి క్రిమిసోకినప్పుడు దానిని నివా రించగలిగేస్థితిలో ఉండి ఆ క్రిమి సంబంధించినంత వరకూ అతడిలో సహజసిద్ధ నిరోధకశక్తిని తయారు చేస్తాయి.

శరీరంలోని వివిధ రకాల రోగాలతో పోరాడే యాంటీ బాడీస్‌ తయారయ్యేట్లు టీకాలు ద్వారా శరీరాన్ని కృత్రిమంగా ప్రేరేపిస్తుం టారు డాక్టర్లు. టీకాలులోని సూత్రం: ఫలానా వ్యాధికి సంబంధించిన పదార్థాన్ని తగు మోతాదులో టీకాలు ద్వారా శరీరంలోకి ప్రవేశపెట్టినప్పుడు ఆ వ్యాధి ఏర్పడకుండానే ఆ వ్యాధితో పోరాడి గెలవగలిగే యాంటీబాడీస్‌ శరీరంలో ఉత్పత్తి అవుతాయి. ఇక అప్పటినుంచీ ఆ వ్యక్తిని ఆ వ్యాధి క్రిములు ఏమీ చేయజాలవు.

అంటే అతడి శరీరం అప్పటినుంచి ఆ వ్యాధి క్రిములను నివారించగలిగే స్థితికి చేరుకుంటుందన్నమాట. అన్ని రకాల ఇన్‌ఫెక్షన్లకు టీకాలు అందుబాటులోకి రాలేదు. కాని ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకా లతో కొన్ని వ్యాధులను నివారించుకోగలస్థితిలో ఉన్నాం. చికిత్స : అంటువ్యాధులకు వైద్యపరమైన చికిత్స ఆయా వ్యాధికారక క్రిములనుబట్టి ఉంటుంది. ఉదాహరణకు – డిఫ్తీరియా (కోరింత దగ్గు), గనేరియా, న్యుమోనియా, సిఫిలిస్‌, క్షయ, టైఫాయిడ్‌ వంటి బాక్టీరియా కారణంగా ఏర్పడే జబ్బులకు పెన్సిలిన్‌ వంటి యాంటీబయాటిక్స్‌ అద్బు తంగా పని చేస్తాయి.