చెట్లు పైకి పెరగడానికి కారణం

తెలుసుకోండి ..
                               చెట్లు పైకి పెరగడానికి కారణం

TREE
TREE

మనం రోజూ రకరకాల చెట్లు, మొక్కలను చూస్తుం టాం. వాటిలో దోస, బీర వంటి కూర మొక్కలు, నిమ్మ, జామవంటి ఫలవృక్షాలు, రావి, వేప వంటి మహా వృక్షాలు నిలువ్ఞగా పైకి పెరుగుతాయి. ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా? భూమి గురుత్వాకర్షణ శక్తికి మొక్కలు వ్యతిరేకత ప్రదర్శిస్తుం టాయి. అలాగే కొమ్మలు సహజం గా కాంతి ఎక్కువగా లభించ ేటప్పుడు పైకి ఎదగడానికి మొగ్గు చూపుతాయి. అందుకే కొమ్మలు పైకి ఏటవాలుగా సూర్యుని వైపునకు ఎదిగి తమకు కావలసిన వేడిమిని, కాంతిని పొందగలుగుతున్నాయి. భూమ్యాకర్షణశక్తికి వ్యతిరేకత ప్రదర్శించటం వల్ల చెట్టు మాను కింద భాగంలో ఎక్కువ సంఖ్యలో కణాలు తయారై పై వైపునకు కింద భాగంలో తక్కువ సంఖ్య లో కణాలు ఉత్పత్తి అవ్ఞతాయి. అందుకే మాను కింది భాగం లావ్ఞగా ఉండి పైకి వెళ్లే కొద్దీ సన్నగా అవ్ఞతూ ఉంటుంది. బంగాళదుంప, క్యారట్‌, బీట్‌రూట్‌, వేరుశనగ, కంద, పెండలం, చేమదుంప, ఉల్లి వంటివి పెరుగుతాయి. వాటి వేరుభాగం మాత్రం కిందికి పెరుగుతుంది. వాటిలోనే అవి ఆహారాన్ని నిలువ ఉంచు కుంటాయి. అవే మనకు ఆహారంగా ఉపయోగపడుతున్నాయి.