చుండ్రు పోవాలంటే…

DANDRUFF
DANDRUF

చుండ్రు పోవాలంటే…

చర్మకణాలు ఎప్పటికప్పుడు నశించి, కొత్తవి పుట్టుకొస్తాయి. ఈ ప్రక్రియ శరీరంపై మనకి కన్పించదు. నెత్తిమీద చర్మంపై కొన్నిసార్లు కొంతమందిలో పై విషయం కనిపిస్తుంది. దాన్నే చుండ్రు అంటారు. చర్మం పొడిగా ఉండటం వల్ల చుండ్రురాదు. చుండ్రు ఏ వయస్సు వారికైనా రావొచ్చు. చికిత్స ద్వారా మాత్రమే కొన్ని పరిష్కరించగలము. జింక్‌, అత్యవసర ఫాటీ ఆమ్లాలను కలిగిన గుమ్మడికాయ గింజలు, వేరుశనగలు, కూరగాయ నూనెలు చుండ్రుని తరిమికొడతాయి. తొలగిస్తాయి.

దువ్వెనలను ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా, నీట్‌గా ఉంచుకోండి. వీలయితే మీ దువ్వెన సెపరేట్‌గా ఉంచుకోండి. రెగ్యులర్‌గా హెయిర్‌ను బ్రష్‌ చేసుకోండి.

రెండు టీ స్పూన్లు వెనిగర్‌ తీసుకోండి. దాన్ని ఆరు టీస్పూన్ల వాటర్‌లో కలపండి. రాత్రి నిద్రబోయే ముందు తలకి అనగా నెత్తిమీద చర్మానికి రాయండి. ఆపైన తలంతా కవర్‌ అయ్యేలా కప్పి ఉంచుకోండి. ఉదయాన్నే తలను వాష్‌ చేసుకోండి. షాంపూతో స్నానం అయ్యాక వెనిగర్‌ నీళ్లతో మరోసారి వాష్‌ చేసుకోండి. ఇలా నెలకి నాలుగుసార్లు చేయండి.

ఒక టీస్పూన్‌ నిమ్మపండు రసాన్ని రెండు టీస్పూన్ల వెనిగర్‌ని కలపండి. దానితో తలని మసాజ్‌ చేసుకోండి. పది చేతివేళ్లు జుట్టు మధ్యలో నుంచి తలపై నున్న చర్మానికి అంటు కునేలా చేతివేళ్ల చర్మంతో మసాజ్‌ చేసుకోండి. ఆ తర్వాత ఎగ్‌షాంపూతో తలస్నానం చేయండి.

ఆల్మండ్‌ నూనె టీస్పూన్‌, సల్ఫర్‌ పొడి ఒక టీస్పూన్‌, స్పిరిట్‌ రెండు టీస్పూన్లు, నాలుగు టీ స్పూన్ల నీరు లేదా రోజ్‌వాటర్‌ తీసుకుని కలపండి. కలిపిన దానితో తలమీద మసాజ్‌ చేసుకోండి.

ఆల్మండ్‌ నూనెతో తలను బాగా మసాజ్‌ చేసుకుని వేడినీటిలో టవల్‌ను ముంచి, దాన్ని నీరు కాకుండా లైట్‌గా పిండి, టవల్‌ను తలకు చుట్టుకోండి. ఓ అరగంట అలాగే ఉంచండి.

ఆమ్లా, రీత, శీకాకా§్‌ు వందేసి గ్రాములు తీసుకుని రెండు లీటర్ల నీటిలో కలిపి వేడిచేయండి. దాదాపు సగం నీరు ఆవిరయ్యేం తవరకూ వేడిచేయాలి. షాంపులా దాన్ని ఉపయోగించటం ద్వారా చుండ్రుపోవటమే కాక జుట్టు పట్టులా మారుతుంది. దట్టంగా ఉంటుంది.

మెంతిగింజలను ఓ రోజంతా నీటిలో నానబెట్టండి. అలా నానబెట్టిన మెంతి గింజలను పేస్ట్‌లా చేయండి. తలమీద చర్మంపై బాగా మసాజ్‌ చేసుకోండి.