చీరపై అల్లికలు చేసేటప్పుడు…

ALLIKALU
ALLIKALU

చీరపై అల్లికలు చేసేటప్పుడు…

ముందుగా డిజైన్‌ పూర్తి ట్రేస్‌ తీసాకనే ఎంబ్రాయిడరీ చేయాలి. ్జ పల్లటి పేపరు మీద నుంచి ట్రేస్‌ తీయడానికి కార్బన్‌ పేపరు వాడకూడదు. చీరకు కార్బను మరకలవ్ఞతాయి. చీర అడుగుభాగాన ఉంచి పెన్సిల్‌తో ట్రేస్‌ తీయడమే మంచిది. రెండు పొరల దారంతో ఎంబ్రాయిడరీ చేసేటప్పుడు ఒక పొర దారాన్నే సూదిలో ఎక్కించి కొనలు ముడివేసి రెండు పొరలుగానే సూదిలోకి ఎక్కించి కుట్టాలి. అందువలన పని తొందరగానూ పూర్తవ్ఞతుంది. ముడతలు లేకుండాను ఉంటుంది.

ఏదయినా గుడ్డపై కుట్టిన ఎంబ్రాయిడరినీ ఫ్రేం చేయించదలిస్తే ముందుగా ఆ గుడ్డను ఉప్పునీటిలో ఉతికి ఆరేస్తే దారాల పోగులు పోకుండానూ సంవత్సరాల తరబడి పురుగు పట్టకుండానూ ఉంటుంది.

అల్లిక వర్కు చేసేటప్పుడు గుడ్డకు ముందుగా టాకా వేసి తర్వాత కుట్టుకుడితే ముడతలు పడకుండా కుట్టు త్వరగా అవ్ఞతుంది.

స్వెట్టర్‌ అల్లేటప్పుడు జేబుల లైనింగుకు నూలు బట్టలనే ఉపయోగించాలి. అందువలన జేబులు సాగకుండా ఉంటాయి.

ఎంబ్రాయిడరీ బట్టలను ఎప్పుడూ వెనుకవైపునే ఇస్త్రీ చేయాలి తద్వారా డిజైనులు బాగా కనిపిస్తాయి దారాల మెరుపు పోదు.
====