చివరి వరకూ మార్కెట్ల ఊగిసలాటే…

stock market
stock market

ముంబయి: స్టాక్‌ మార్కెట్లలో సెన్సెక్స్‌,నిఫ్టీ ఎనిమిదోరోజు కూడా లాభాల్లోనే కొనసాగి చివరకు కొంతమేర దిగువన ముగిసాయి. సెప్టెంబరుత్రైమాసికంలో
ఆర్ధికవృద్ధి గణాంకాలు రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీల షేర్లు కూడా ప్రభావితంచేశాయి. ఎన్‌ఎస్‌ఇ సూచీ నిఫ్టీ 29.3 పాయింట్లు దిగువన
10,370.25 పాయింట్లవద్ద స్థిరపడితే బెంచ్‌మార్క్‌ బిఎస్‌ఇ సెన్సెక్స్‌ 105.85 పాయింట్లు దిగువన 33,618.59 పాయింట్లవద్ద ట్రేడింగ్‌ముగించాయి.
ఎఫ్‌ఎంసిజి, ఆటో రంగాలుమినహా ఇతర బిఎస్‌ఇ విభాగసూచీలన్నీ ప్రతికూలంగానే ముగిసాయి. వినియోగరంగ ఉత్పత్తులసూచీ 0.92 టెక్‌సూచీ 0.64శాతం, ప్రభుత్వరంగ సంస్థలసూచీ 0.61శాతం, ఐటి రంగం 0.55శాతంపెరిగాయి. ఎఫ్‌ఎంసిజి సూచీ కూడా 0.1శాతం పెరిగింది. ఆటో రంగం 0.04శాతం వృద్ధిలోనికి దూసుకువెళ్లాయి. సెన్సెక్స్‌లోని టాప్‌ ఐదు సంస్థలు లాభాలు చవిచూసిన సంస్థల్లో మారుతిసుజుకి 1.48శాతం, హెచ్‌డిఎఫ్‌సి 1.03శాతం, కోల్‌ ఇండియా 1.03శాతం, ఏసియన్‌ పెయింట్స్‌ 1.01శాతం, బజాజ్‌ ఆటో 0.68శాతంపెరిగాయి. ఇకటాప్‌ ఐదు నష్టాల సంస్థల్లో ఎన్‌టిపిసి 1.88శాతం, భారతి ఎయిర్‌టెల్‌ 1.56శాతం, ఇన్ఫోసిస్‌ 1.3శాతం, టాటామోటార్స్‌ 1.23శాతం, సన్‌ఫార్మా 1.19శాతం నష్టపోయాయి. జిడిపిలో కొంతమేర రికవరీ ఉంటుందన్న భావనతో ఎంపికచేసిన రంగాలు కొంతమే రపెరిగాయి. ఏప్రిల్‌జూన్‌త్రైమాసికంలో మూడేళ్ల కనిష్టస్థాయికి చేరాయి. ఆసియా మార్కెట్లు కూడా దశాబ్దకాలంనాటి గరిష్టస్థాయినుంచి వెనక్కుమళ్లాయి. చైనా మార్కెట్లలో షేర్లు వరుసగా రెండోరోజు కూడా కూలబడ్డాయి. అమెరికా సెనేట్‌ పన్ను సంస్కరణలపై ఓటింగ్‌ ఆధారంగా డాలర్‌నడిచింది. మోర్గాన్‌ స్టేన్లీ కేపిటల్‌ ఇంటర్నేషనల్‌సూచీ ఆధారంగాచూస్తే జపాన్‌ బయటిప్రాంత ఆసియాపసిఫిక్‌ షేర్లు 0.3శాతం దిగజారాయి. 570.21 పాయింట్లుగా ఉన్నాయి. ఈ ఏడాదిలో ఎక్కువభాగం ఈ షేర్లు పైపైకి ఎగిసినా మార్కెట్ల ఒడిదుడుకుల కారణంగా కొంతమేర ప్రతికూలతలు కూడా చవిచూసాయి. వాల్‌స్ట్రీట్‌ షేర్లు సోమవారం మివ్రమంగా ముగిసాయి. ఎస్‌అండ్‌పి 500, నాస్‌డాక్‌లు 0.1శాతం క్షీణించాయి.  డౌజోన్స్‌ మాత్రం 0.1శాతంపెరిగింది. ఇన్వెస్టర్లు,ట్రేడర్లు ఎక్కువగా గురువారం విడుదలయ్యే జిడిపి గణాంకాలపైనే దృష్టిపెట్టారు. విక్రయాలు లేని రియాల్టీ స్థిరాస్తులపై ప్రభుత్వం పన్ను వేసేందుకు నిర్ణయించడం, వచ్చేపన్ను ఎలా ఉంటుందన్న ఊహాగానాలు కూడా కొంత హౌసింగ్‌ రంగంపై ప్రభావంచూపిస్తుంది.  ఈ కారణంగా రానున్న కాలంలో హౌసింగ్‌ కార్యకలాపాలు పెరుగుతాయి. బిఎస్‌ఇ మిడ్‌క్యాప్‌, బిఎస్‌ఇ స్మాల్‌క్యాప్‌ సూచీలు 0.1శాతం, 0.3శాతం చొప్పున పెరిగాయి. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఇన్ఫోసిస్‌ కంపెనీలు మార్కెట్‌ల సెంటిమెంట్‌పై భారం మోపాయి. ప్రభుత్వపరిధిలోని భెల్‌ 64 కోట్ల విలువైన ఆర్డరు సాధించింది. అయితే షేర్లు నిలకడగానే సాగాయి. ఎరిక్‌ లైఫ్‌ సైన్సెస్‌ 5.13శాతం పెరిగి 683.60 రూపాయలుగా మారాయి.