చిరు 151వ చిత్రం అదేనట

Chiru, Srikanth
Chiru, Srikanth

చిరు 151వ చిత్రం అదేనట

చాలా రోజుల తర్వాత చిరంజీవి 150వ చిత్రం ఖైదీనెంబర్‌ 150తో సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వటం భారీ కలెక్షన్లు సాధించి రికార్డులు క్రియేట్‌ చేసి మళ్లీ నెంబర్‌ 1 స్థానాన్ని అధిష్టంచటం జరిగిపోయాయి.. మెగా అభిమానుల ఆనందానికి అంతేలేకుండా పోయింది.. ఆ సంబరంలోనే చిరంజీవి 151వ సినిమాగా ఏ కథను చేస్తారు అనే ప్రశ్న అభిమానుల్లో మొదలైంది.. కొన్నేళ్ల క్రితం పరుచూరి సోదరులు తయారుచేసిన ‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథనే చిరంజీవి చేస్తారనే ప్రచారం కూడ జరిగింది. సురేందర్‌రెడ్డి ఆ సినిమాకు దర్శకత్వం వహిస్తారని,, తాను అ సినిమాను నిర్మిస్తానని అప్పట్లో రామ్‌చర్‌ అన్నారే కానీ కథ చెప్పలేదు.. దీంతో అభిమానుల్లో ఉత్కంఠ పెరిగిపోయింది..
ఈ తరుణంలో చిరుకి సన్నిహితుడైన హీరో శ్రీకాంత్‌ చిరు 151వ సినిమా ఏమిటన్నది స్పష్టం చేశారు.. ఒక ఛానల్‌లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తొలి తలెగు స్వాతంత్య్ర సమరయోధుడు , రాయలసీమ వాసి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గానే చిరంజీవి 151వ చిత్రంగా చేయబోతున్నారని క్లారిటీ ఇచ్చారు.. శ్రీకాంత్‌ చెప్పిన మాటతో అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు.. తొలిసారిగా చిరు ఒక వాస్త గాధలో అదీశక్తివంతమైన తెలుగు స్వాతంత్య్రయోథుడు పాత్రలో కన్పించబోతుండటంతో ఆ సినిమా ఎలా ఉంటుంది.. అందులో చిరు గెటప్‌ ఎలా ఉంటుంది.. అన్న ఆసక్తి నెలకొంది..కాగా అధికారింగా ప్రకటన రావాల్సి ఉంది.