చిరు ప్రాయంలోనే క్రికెట్ అకాడ‌మీ

sanju samson
sanju samson

తిరువనంతపురం: భారత యువ క్రికెటర్ సంజు శాంసన్ క్రీడాకారులకు శిక్షణ ఇచ్చే అకాడమీని ప్రారంభించాడు. ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో 23ఏళ్ల శాంసన్ రాజస్థాన్ రాయల్స్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్ ఆటగాళ్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసిన సిక్స్ గన్స్ స్పోర్ట్స్ అకాడమీని ఎంపీ శశి థరూర్ ప్రారంభించారు. ఈ అకాడమీని కేవలం క్రికెట్‌కు మాత్రమే పరిమితం చేయలేదని.. ప్రతిభ కలిగిన ఫుట్‌బాల్ క్రీడాకారులను అత్యుత్తమంగా తీర్చిదిద్దేలా శిక్షణ ఇస్తామని శాంసన్ వివరించాడు. తిరువనంతపురంలో అకాడమీ ఉన్నప్పటికీ సెలక్షన్ క్యాంపులను రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తామని పేర్కొన్నాడు.