చిరు నివాసంలో ర‌క్షాబంధ‌న్‌

Chiranjeevi
Chiranjeevi

మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా చిరంజీవికి ఆయన సోదరీమణులు మాధవి, విజయలు రాఖీ కట్టారు. సంప్రదాయ బద్ధంగా తమ సోదరుడుకి హారతి ఇచ్చి, మిఠాయి తినిపించారు. అనంతరం ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. అనంతరం తన సోదరీమణులకు చిరంజీవి కానుకలు ఇచ్చారు. తన తోబుట్టువులను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని, హత్తుకున్నారు. దీనికి సంబంధించిన వీడియోను చిరు కోడలు ఉపాసన సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘ప్రియమైన సోదరీమణులతో మామయ్య రక్షాబంధన్ వేడుకలు’ అంటూ ఉపాసన పేర్కొన్నారు.