చిరునవ్వుల బాలలం

      బాలగేయం
                                      చిరునవ్వుల బాలలం

SPORTS
SPORTS

చిన్ని చిన్ని బాలలం
చిన్నారి పొన్నారి బాలలం
చిలుక మాటల పలుకులతో
చిర్రగోనె, చిత్తు బొత్తులంటూ
చిత్రమైన ఆటలతో
చిరుతవలె పరుగెత్తుతాము
చిరుతిండిని లాగిస్తూ
చిటపట చినుకుల జల్లులలో
చిరునవ్వులు చిందిస్తాము
చిందులేసి విహరిస్తూ
చిచ్చర పిడుగులమై మేము
చిత్తు చేస్తు చింతలన్ని
చిరకాలం చరితలో
చిరంజీవ్వలమై నిలిచెదం
– రాజ్‌కుమార్‌ బస్వ, సిద్ధిపేట