చిరునవ్వులు చిందిస్తూ ఆయుధ ప్రదర్శన

గతంలో ఎన్నడూ లేనంత ఉల్లాసంగా కనిపించిన కిమ్

ప్యోంగ్‌యాంగ్‌: అమెరికా పట్ల ఎన్నో సందేహాలతో ఉన్న ఉత్తర కొరియా ఆయుధ సంపత్తి అభివృద్ధిపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఆ దేశం ఆయుధ ప్రదర్శన నిర్వహించింది. ఈ రక్షణ రంగ ఉత్పత్తుల ప్రదర్శనలో దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ కూడా పాల్గొన్నారు. తాజాగా, ఆయనకు సంబంధించిన తాజా వీడియో వెలుగులోకి వచ్చింది.

తమ దేశ యుద్ధ విమానాలు గాల్లో విన్యాసాలు చేస్తుండగా, ఆయన చిరునవ్వులు చిందిస్తూ ఆస్వాదించడం ఆ వీడియోలో కనిపించింది. అంతేకాదు, తన సైనిక జనరళ్లతో కలిసి హాయిగా బీరు తాగుతూ, చేతిలో సిగరెట్ తో సేదదీరుతున్న దృశ్యాలు కూడా ఆ వీడియోలో ఉన్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఉల్లాసంగా కిమ్ ఉన్నట్టు తాజా ఫుటేజి వెల్లడిస్తోంది.

తాజా బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/business/