చిరునవ్వుతో చికాకులు మాయం

smileing
smileing

చిరునవ్వుతో చికాకులు మాయం

చీటికీమాటికీ, చిన్నాచితకా కారణాలకీ కొందరికి కోపం వరదలా వెల్లువెత్తుతుంది. ఉద్రేకంతో ఊగిపోతారు. మనసు, మాట అదుపు తప్పుతాయి. ఆనక, పరిస్థితి బీభత్సం. తర్వాత నిశ్శబ్దంలా భయపెడుతుంది. అప్పటికే వ్యక్తిత్వానికి దెబ్బపడుతుంది. అలా కాకుండా చిర్రెత్తుకొచ్చే కోపాన్ని చిరునవ్ఞ్వల మాలలా ఎలా మలచుకోవచ్చో చూద్దాం. ్య ఉద్రేకం శరీరానికి మంచిది కాదు. నిజమే అలాని అసలు కోపమే రాకూడదు అనుకోవడం పొరపాటు. కొందరివి పాలపొంగు లాంటి కోపాలు, అవి ఇలా పొంగి అలా చల్లారిపోతాయి.

ఈ తీరు గురించి మరీ కంగారు పడాల్సిన అవ సరం లేదు. చుట్టూ ఉన్నవాళ్లు కాసేపు సంయ మనం పాటిస్తే సరిపోతుంది. ఈ తరహాను మార్చుకునే తీరు పట్ల కొంచెం శ్రద్ధ పెడితే మార్పు వచ్చేస్తుంది. ్య ఆకలితో, అసహనంతో ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి చేసే చిన్న తప్పులు కూడా పెద్ద నేరాలుగా కనిపిస్తాయి. దాంతో వెనకా,ముందూ చూడకుండా తోటివారిని ఏది పడితే అది అనేస్తాం.

ఒకవేళ మీకే ఇటువంటి పరిస్థితి తలెత్తితే ముందు కడుపునిండా తినండి. మీలో ఉద్రేక తీవ్రత చల్లారుతుంది. అయినా కోపం తగ్గలేదా? హాయిగా నిద్రపోండి. మెదడుకి విశ్రాంతి లభి స్తుంది. మర్నాటికి కోపం ఫటాఫట్‌. మనసు శాంతిస్తుంది. నిద్ర, ఆకలి కోపాన్ని పెంచేస్తాయి. ముందు ఆ రెండింటినీ శాంతపరచాలి. ్య ఆలోచనల్లో లోతు ఉన్నవారికి త్వరగా ఆవేశం రాదు. వచ్చినా బయటకు వెల్లడించరు. విసుగు అధికం అయినప్పుడు మనసు బాగా లేనప్పుడు నోటికి పని చెబితే కఠినమైన మాటలు తూలతాం. అలాంటప్పుడు మౌనానికి మించిన మంచి మార్గం మరొకటి లేదు. ్య కొన్ని సందర్భాల్లో ఎదుటి వ్యక్తి ప్రవర్తన ఏమాత్రం నచ్చదు. నిభాయించుకోలేని పరిస్థితి. అప్పుడు ఒకటి నుంచి వంద. పోనీ యాభై, కనీసం పది లెక్కపెట్టండి. పాత మంత్రమే కానీ ఫలితాన్నిస్తుంది. అప్పటికప్పుడు నిరసన తెలపడం, కోపం వెళ్లగక్కడంలో ఏమిటి ప్రయోజనం? తక్షణం వాయిదా వేయండి. తరువాత సమీక్షించుకోండి. ్య ఏ విత్తనం వేస్తే ఆ మొక్కే వస్తుంది.

ఆ ఫలాలనే ఇస్తుంది. కోపం కూడా అంతే. మన మనసులో ఆలోచనలనే బీజాలుగా చేసుకుని ఎదుగుతుంది. ప్రతి నిమిషం మన ఆలోచనలను సవ్యమైన మార్గంలో నడిపిస్తే చిరునవ్ఞ్వలకే కానీ చిరుకోపాలకి కూడా తావ్ఞండదు. ్య నాకసలే కోపమెక్కువ. నాగ్గానీ చిర్రెత్తుకొచ్చిందా ఏం చేస్తానో తెలియదు అని కొందరు తమలోని లోపాన్ని గొప్పగా ప్రకటించుకుంటారు. కోపం ముసుగులో ఏం చేసినా చెల్లుతుందా? కోపం రావడానికి పెద్ద కారణం ఉండాలి. తుమ్మితే ఊడిపోయే ముక్కులా తరచూ ఆవేశం వచ్చేస్తుంటే ఎలా? కోపం నా బలహీనత. అది నా జీన్స్‌లో ఉంది. ఏం చేస్తాం అనే బదులు తీవ్రతను తగ్గించడంపై దృష్టి నిలపండి. ఎందుకంటే అది తోటివారితో మనకుండే బంధాలను విచ్ఛిన్నం చేయకూడదు కదా!
నవ్వించే మిత్రులతో స్నేహం చేయండి.
నాలుగు జోక్స్‌ చదివి నవ్వుకోండి. అసంతృప్తి అధికం అయినప్పుడు శ్వాసమీద దృష్టి నిలిపి కాసేపు ధ్యానంలో కూర్చోండి.
ఆలోచనలను స్వేచ్ఛగా బయటకు రానీయండి. కాసేపటికి ఇంకేం ఆలోచనలు మిగలవు బుర్ర ఖాళీ అవుతుంది. ఒత్తిడి, అశాంతి దూరమవుతాయి
దూసుకొచ్చే కోపానికి పూర్తిగా ఆనకట్ట వేయడం, పూర్తి పాజిటివ్‌ ఎనర్జీగా మార్చేయడం ఎవరి తరమూ కాదు. నవ్ఞ్వ, ఏడుపు, నిద్రలానే అది కూడా ఓ రకమైన భావోద్వేగమే! దానిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. మనసు పొరల్లో పేరుకోకుండా చూసుకోవాలి. సమయం, సందర్భం చూసుకుని సాధారణ భావోద్వే గంలా బయటకు రానివ్వాలి. అప్పుడే మనసు నెమ్మదిస్తుంది.