చిరుత దాడిలో తొమ్మండుగురికి గాయాలు

Leopard
Leopard

అసోంలో ఓ చిరుతపులి కలకలం రేపింది. అటవీ ప్రాంతం నుంచి దారితప్పి జోర్హత్ గ్రామంలోకి ప్రవేశించిన చిరుత గ్రామస్తులపై దాడి చేసింది. దాన్ని పట్టుకోవడానికి స్థానికులు, అటవీ శాఖ అధికారులతో కలిసి కర్రలు పట్టుకుని వచ్చారు. వారిపై కూడా చిరుత దాడి చేయడంతో వారికి గాయాలయ్యాయి. మొత్తం తొమ్మిది మందిపై ఆ చిరుత దాడి చేసిందని అక్కడి అధికారులు చెప్పారు. గాయాలపాలైన వారికి స్థానిక ఆసుపత్రిలో చికిత్స అందుతున్నట్లు తెలిపారు.