చిరుతిళ్లూ మేలే!

EATING
EATING

చిరుతిళ్లూ మేలే!

నమ్‌కీన్‌లు, చిప్స్‌, బిస్కెట్లు, కుకీలు ఇవన్నీ విలాసవంతమైన గ్యాస్ట్రో నామికల్‌ చిరుతిళ్లు, విలాసవంతమైన చిరుతిళ్లను ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని సూక్ష్మబుద్ధితో ఎంపిక చేసుకోవాలి. దేశంలోని ఆరు మెట్రో నగరాలలో చేసిన సర్వే ప్రకారం హైదరాబాద్‌, ఢిల్లీలలో ప్రజలు స్నాక్స్‌ను ఎక్కువగా తీసుకుంటున్నట్లు తేలింది. ఈ సర్వేను ఢిల్లీ, ముంబయి, లక్నో, అహ్మదాబాద్‌, బెంగళూరు, హైదరాబాద్‌లాంటి నగరాలలో నిర్వహించారు. ఇందులో భాగంగా 20 నుంచి 55లోపు 3012 మంది స్త్రీల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నా

రు. న్యూట్రిషన్‌ను పాటించడంలో దేశంలో పెరుగు తున్న అశ్రద్ధ దీని ద్వారా వెల్లడైంది. 96శాతం మందికి షోషక విలువలున్న తినుబండారాల అవగాహన ఉంది. కాని 1/5 వంతు మాత్రమే స్నాక్స్‌ తీసుకునే విషయంలో ఆరోగ్యపరమైన శ్రద్ధ వహిస్తున్నట్టు తెలిపింది. ఈ గణాంకాలు ఆశాజనమైనదనీ, గృహిణులకు పోషకవిలువల గురించి తెలుసని, వారి కుటుం బానికి ఎటువంటి పోషక విలువలున్న ఆహారం ఇవ్వాలో, ఫిట్‌నెస్‌ ఆరోగ్య విషయంలో ఎటువంటి శ్రద్ధ కనపరచాలో అవగాహన ఉండటం శుభసూచి కమని ఢిల్లీకి చెందిన న్యూట్రీషనిస్ట్‌ రితీశ సమద్ధార్‌ అన్నారు.

కాని వీటిని పాటించడంలో కొన్ని లొసుగులున్నాయని కూడా అన్నారు. 63శాతం గృహిణులు మరుసటిరోజు భోజనం గురించి ఒకరోజు ముందరే ఆలోచించి పెట్టుకుం టారని ఈవిధంగా కుటుంబం ఆరోగ్యంగా ఉండేందుకు శ్రద్ధ చూపిస్తారని అన్నారు.

ముంబయికి చెందిన మాధుకి దుయా మాట్లాడుతూ బాదంపప్పులు ఆరోగ్యానికి మంచిదని, ఆకలివేళలో ఎంతో దోహదం చేస్తాయని, వీటిలో ప్రొటీన్లు అధికమని, ఫైటల్‌, కాల్షియం, విటమిన్‌ ఇ, రిబోఫ్లేవిన్‌, నియాసిన్‌ కూడా మిగతా వాటితో పోలిస్తే అధికమని అన్నారు. 75శాతం మంది డేట్స్‌, కష్యూనట్స్‌, వాల్‌నట్స్‌, పిస్తాబియోన్‌, రెయిజిన్స్‌ కంటే బాదం ఆరోగ్యకరమైనది అభిప్రాయపడ్డారు.

నలుగురిలో ముగ్గురు ఉదయం టిఫిన్‌లో టీ/కాఫీ, కుకీలు తీసుకుంటారని అన్నారు. వీటిలో కూడా మంచి కేలరీలే ఉంటాయి. 63శాతం మంది వారు ఆకలితో ఉన్నపుడు గాని లేదా టీవి చూసేపు డుగాని నమ్‌కీన్లు, కుకీలు, నట్స్‌ తీసుకుంటారని చెప్పారు. ్పు ట్స్‌ తీసుకుంటారని చెప్పారు.