చిరాకు లేని వంటిల్లు

COOKING2
COOKING2

చిరాకు లేని వంటిల్లు

వంటగది విశాలంగా ఉండే కంటే సకల సౌకర్యాలతో చిన్నగా ఉంటేనే అందంగా, పొందిగ్గా ఉంటుంది. పనులూ సులువ్ఞగా ముగుస్తాయి. ఈ రకం వంటగదిలో అలమరలన్నీ వీలుగా ఉండాలి. పనిచేసుకునే చేతివీలును బట్టి వస్తువ్ఞలు సర్దుకోవాలి. సాధారణంగా ఎవరైనా కుడిచేత్తోనే పనిచేస్తారు. కనుక స్టవ్‌కు కుడిపక్కగా వంటకు ఉపయోగించే పదార్థాల తాలూకు సామగ్రిని సర్దుకోవాలి. ఎన్నిసైజులు అవసరమనుకుంటే అన్ని సైజుల్లో ప్లాస్టిక్‌ కంటెయినర్లను కొనుగోలు చేసుకోవాలి. విభిన్న సైజుల హక్కులను కొని గోడకు అమర్చుకుంటే పాన్‌ల వంటివి తగిలించుకోవడానికి అనువ్ఞగా ఉంటుంది. మాగ్నెట్‌ అమర్చుకుంటే చాకులు, పీలర్స్‌ తగిలించవచ్చు. కూరలు కట్‌చేసుకునే బోర్డు పెద్దది కొనుగోలు చేసుకోవాలి. బోర్డు పక్కనే చెత్తబుట్ట ఉంచుకుంటూ వృధా పదార్థాల్ని దానిలో ఎప్పటికప్పుడు వేసేయ వచ్చు. అప్పుడు వంటగది అస్తవ్యస్తంగా కాకుండా ఎంతో నీట్‌గా ఉంటుంది. ఉప యోగించే వస్తువ్ఞల్ని అవసరం మేరకే ఉంచు కోవాలి తప్ప అదనంగా అనవసర మయిన వాటిని ఉంచుకోకూడదు. దీనివల్ల అలమరలు, గట్టు అన్నీ ఇరుకైపోతుంటాయి.