చిరాకు పడితే అన్నీ చిక్కులే

STRESS
STRESS

This slideshow requires JavaScript.

చిరాకు పడితే అన్నీ చిక్కులే

బొట్టుబొట్టుగా పడిన వాననీరు రాయిని సహితం నునుపు చేసేస్తుంది. అదేవిధంగా చికాకు ఎక్కువైన కొద్దీ మనశక్తిసామర్థ్యాలన్నీ ఈ బాధ కింద ఖర్చయి మన భవిష్యత్తును దెబ్బతీస్తాయి. కాబట్టి ఈ చికాకు నుండి ప్రతి ఒక్కరూ బయటపడాలి. దానికి మార్గాలేమిటో తెలుసుకుందాం. కొంతమందిని చూస్తూ ఉంటాం ఎప్పుడూ ఏదో పోగొట్టుకున్న వారిలా బాధపడిపోతూ ప్రక్కనున్న వారికి కూడా తమ బాధ సెగలను వెదజల్లుతూ ఉంటారు. అది వారి తత్వమో లేక తాత్కాలికమో తెలియదు. అటువంటి వారిని మనం కొంతవరకు జాలిగా చూస్తాం., పరిధులు దాటితే పురుషులైనా కూడా సమాజంలో మసలుకోలేరు. బాధలు కనబరచే వారితో మనం ఏం మాట్లాడతాం? మనం యేం మాట్లాడినా అక్కడ అపార్థానికి లోనయి మనకి అనర్థం వాటిల్లుతుంది. ప్రొద్దుటే లేవగానే ”పాలు వచ్చాయా? ఇంకా రాలేదు! రోజూ పాలకోసం నిరీక్షణే! చలికాలంలో మరీ ఆలస్యం. పాలవ్యాను రావాలి. అక్కడికి మన పాలమనిషి వెళ్లాలి. ఆవిడకి పాలు దొరకాలి. ఆవిడ తేవాలి. మనకివ్వాలి.

అప్పుడే కదా మన కంఠంలోకి కాస్త వేడి కాఫీ నీళ్లుపడేవి. అంతవరకు ఈ ఆత్మారాముడు విలవిలలాడి పోతాడు. ప్రొద్దుటే ఈ ప్రాణికి కాస్త కాఫీ పడకపోతే మిషన్‌ పనిచేయదు. డల్‌గా ఉంటుంది. ఏమీ తోచదు. అందరిపైన రుసరుస. దీనినే ఇంగ్లీషులో ‘వర్రీ అని తెలుగులో చికాకు అని అంటారు. కొందరిలో ఈ వర్రీ సూర్యోదయంలా రెగ్యులర్‌గా టైంకి వచ్చేస్తూ ఉంటుంది. వాటితో పాటే ఎక్కడకి వెళ్లినా ఫాలో అయిపోతూ ఉంటుంది. పెళ్లాం మీద, పిల్లల మీద, తను పనిచేసే అధికారుల మీద చెడ్డ చికాకు వర్రీ, కోపం, తనమీద తనకే జుగుప్స ఇవన్నీ రెగ్యులర్‌గా జరిగిపోతూ ఉంటాయి. ఆఫీసులో పనిదండుగ, బిజినెస్‌లో లాస్‌, ఇంట్లో అల్లకల్లోలం, బయట అలజడి, ఎవ్వరూ మనల్ని ఆదరించకపోవడం ఈ చికాకు ఫలితం. తల్లిదండ్రులు అసహ్యించుకుంటారు. పెళ్లాం చీదరించుకుంటుంది.

పిల్లలు భయంతో దూరంగా పారిపోతారు. స్నేహితులు దరికిరారు. తోటిపనివారు సహకరించరు. అధికారుల చేత నెత్తివాచేటట్లు చీవాట్లు జీవితం ఆవిధంగా ‘వర్రీ వల్ల దుర్భరం అవ్ఞతుంది. తనకు సుఖం ఉండదు. తన వారికి సుఖం ఉండదు. ఆరోగ్యం గురించి వర్రీ, ప్రమోషన్‌ గురించి వర్రీ, ఎరియర్సు రాలేదని వర్రీ, పిల్లలకు పెళ్లి కాలేదని వర్రీ, బిజినెస్‌ డల్‌గా ఉందని వర్రీ, అల్లుడు డబ్బు గుంజుతున్నాడనే వర్రీ, కొడుక్కి ఉద్యోగం రాలేదని వర్రీ. వార్థక్యం మీద పడుతూందనే వర్రీ. కోర్టులో కేసు తేలడం లేదనే వర్రీ. ఇస్తానన్నవాడు పైకం ఇవ్వలేదేనని వర్రీ. వస్తానన్న వాడు రాలేదేనని వర్రీ. ఇలా జీవితమంతా ఒకటే వర్రీ, వర్రీ వర్రీ! చాలామంది గతాన్ని గురించి వర్రీ అయిపోతూ ఉంటారు. దీనివల్ల ఫలితం శూన్యం. విషాదభరితం ఆనందం. అనవసరమయిన భయం, ఫలితంగా ఏ పనీ చేయలేకపోవడం. వర్రీ ఆలోచనలను చీలుస్తుంది. ఆవేదనను కలిగిస్తుంది. అవగాహనను నశింపచేస్తుంది. వర్రీ వల్ల యే విషయాన్ని సక్రమంగా చూడలేం. మన దృక్పథం మారుతుంది.

అంచనాలు తప్పవుతాయి. మనోవ్యధకు కారణమవుతుంది. చేద్దామనుకున్న పనులను కూడా ఈ వర్రీ మూలంగా చేయలేని స్థితి యేర్పడుతుంది. దీనిమూలంగా నెర్వస్‌ బ్రేక్‌డౌన్‌ ఏర్పడుతుంది. ఆత్మశక్తి సన్నగిల్లుతుంది. మనిషి ఎల్లప్పుడు సమస్యల వలయంలో చిక్కుకుపోతాడు. ఆలోచనా శక్తిని పూర్తిగా నాశనం చేస్తుంది. దిగులుచెందితే చేసే పనికూడా చెడిపోతుంది. మతిస్థిమితం తగ్గుతుంది. అందుమూలంగా మనిషి ఆత్మశాంతికోసం ‘వర్రీని తాత్కాలికంగా మరచిపోవడం కోసం మద్యపానం, డ్రగ్సు మొదలైన వాటికి అలవాటు పడిపోతాడు. ఆవిధంగా అతని జీవితం నాశనం అవుతుంది.